వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం లోకసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే, విపక్షాలు, తటస్థంగా ఉండే పార్టీలపై చర్చ సాగుతోంది. టీడీపీ అవిశ్వాసం వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది ఉందా? లేక కేవలం ఏపీ సమస్యలను కేంద్రం, దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లేందుకా? అంటే టీడీపీ రెండో కారణమే చెబుతోంది.

సీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారుసీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారు

దీనిని బట్టే అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెప్పవచ్చు. ఇక సంఖ్యాపరంగా చూసుకున్నా ఎన్డీయేకు.. స్వయంగా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కాబట్టి ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెబుతున్నారు.

మోడీ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు కానీ

మోడీ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు కానీ

పార్లమెంటులో మొత్తం లోకసభ సీట్లు 543. ఇందులో ఎన్డీయే కూటమికి 314కు పైగా సీట్లు ఉన్నాయి. యూపీఏ బలం 66. టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు తటస్థంగా ఉన్నాయి. మిగిలిన బలం ప్రాంతీయ పార్టీలవి. ప్రభుత్వంకు మేజిక్ ఫిగర్ 272. కానీ బీజేపీకే ఒంటరిగా 273 స్థానాలు ఉన్నాయి. ఇక కూటమితో కలుపుకుంటే 314కు పైగా మద్దతు ఉంది. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానంతో ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు.

Recommended Video

చంద్రబాబు రోజుకో డ్రామా, అప్పుడు హేళన చేసి : వైసీపీ నేతలు ఫైర్
 పోటాపోటీ చర్చ.. అక్కడే ఇబ్బంది

పోటాపోటీ చర్చ.. అక్కడే ఇబ్బంది

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా విపక్షాలు ఇతర అంశాలను కూడా లాగే అవకాశాలు లేకపోలేదు. అయితే ఏపీకి కేంద్రం ఇచ్చింది, టీడీపీ అడుగుతోన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. తాము చాలా వరకు ఇచ్చామని బీజేపీ చెబుతోంది. అంతగా ఇవ్వలేదని టీడీపీ చెబుతోంది. కాబట్టి ఎవరు గట్టి ఆధారాలతో నిరూపిస్తే వారి పట్ల విశ్వాసం పెరుగుతుంది.

మోడీని దెబ్బకొట్టడమే లక్ష్యం

మోడీని దెబ్బకొట్టడమే లక్ష్యం

2014 సార్వత్రిక ఎన్నికల నుంచి మోడీ హవా కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు అంశాలపై విపక్షాలు దాదాపు ఏకమై మోడీని టార్గెట్ చేస్తున్నాయి. అందుకు యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి, బీహార్‌లో (ఇటీవలి వరకు) ఆర్జేడీ, జేడీయు కూటమి నిదర్శనం.

ప్రతి అంశాన్ని వినియోగించుకునేందుకు లాలూ, మమత ఆరాటం

ప్రతి అంశాన్ని వినియోగించుకునేందుకు లాలూ, మమత ఆరాటం

మరోవైపు, అప్రహతికంగా దూసుకుపోతున్న మోడీని, బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ అవిశ్వాసంతో మోడీ అనుకూలురు ఎవరు, వ్యతిరేకులు ఎవరో తేలిపోతుందని అంటున్నారు. ఈ అవిశ్వాసంతో రాజకీయ రంగులు బయటపడతాయని అంటున్నారు. అవిశ్వాసంపై మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు ఉత్సాహంతో ఉన్నారు. బీజేపీ కన్నా తామే నయమని కాంగ్రెస్ చెబుతోంది. ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెబుతోంది.

నాడు సోనియా గాంధీ, నేడు చంద్రబాబు

నాడు సోనియా గాంధీ, నేడు చంద్రబాబు

పదిహేనేళ్ల తర్వాత అవిశ్వాసం అంశం చర్చకు వస్తోంది. 2003లో సోనియా గాంధీ నాటి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నాడు కూడా దాదాపు ఏడాదికి ముందు అవిశ్వాసం ప్రవేశపెట్టగా, ఇప్పుడు ఏడాది ముందు టీడీపీ ప్రవేశపెట్టింది.

English summary
The no trust motion does not endanger the BJP led government. The BJP has 273 members in the Lok Sabha, far over the half-way mark, besides the allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X