చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆఫీస్ లో నీళ్లు రావట్లేదు..! ఇక ఇంటి దగ్గర నుండి పనిచేయాలని ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు..!!

|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్ : సముద్ర మద్యలో ఉన్నా దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు లేదని ఓ మహానుభావుడు పాట రూపంలో అద్బుతంగా చెప్పాడు. ఇప్పుడు చెన్నైలో అవే పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ చెన్నై ఐటీ ఉద్యోగులకు వారి కార్యలయంలో ఓ విచిత్రమైన బోర్డ్ దర్శనమిచ్చింది. దాన్ని చదువుకున్న ఉద్యోగులు అవాక్కయారు.

అభివృద్దిలో పోటీ పడుతున్న చెన్నై వంటి నగరంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. చుట్టూ సముద్రం ఉన్నా వాడుకోవడాదనికి నీళ్లు దొరక్కపోవడం ఏంటని ఉద్యోగులు తమలో తాము ప్రశ్నించుకుంటున్నట్టు తెలుస్తోంది. నీళ్లు రాని కారణాంగా ఉద్యోగులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఇంటి నుంచే ఆఫీస్ పని చేయాలని ఆదేశాలు జారీ కావడంతో ఉద్యోగుల్లో అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

No water in the office.!IT employees to work from home..!!

నీటి కొరతతో చెన్నై నగరం కటకటలాడుతోంది. ఆశించిన స్థాయిలో ఇప్పటికీ వర్షాలు పడకపోవడంతో... జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం నీటి ఎద్దడిని తట్టుకోలేక... అసాధారణ నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోంది. నీళ్లు లేవు..ఇక ఇంటికెళ్లండి. అక్కడి నుంచే పనిచేస్కోండి, ఇది..చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వు. రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించినప్పటికీ... ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కార్పోరేట్ కంపెనీలు కూడా నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సివస్తోంది.

ఐటీకి కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ అయిన చెన్నయ్ ఓఎమ్మార్ రోడులోని సంస్థలు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఆనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇంటినుంచి పనిచేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు మాత్రం నీటి సంరక్షణ, పునర్వినియోగం కోసం అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే వర్షాలు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంటాయనే అంచనా..ప్రస్తుత పరిస్థితిల్లో కొంత ఊరట నిచ్చే అంశం.

English summary
Corporate companies can not tolerate water bottlenecks,to make exceptional decisions. No water no Work from there, which is the order issued by an IT company in Chennai. Even if the monsoon arrives in India ... Without expecting rains, corporate companies also have to make a decision to cope with water scarcity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X