వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్వీకుల్ని పొగడటంలో తప్పేంటి: క్రాఫ్ట్స్, టెక్నాలజీపై కేంద్రమంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మన పూర్వీకుల ఘనతను మనం తలుచుకోవడంలో తప్పేమిటని కేంద్రమంత్రి హర్షవర్ధన్ గురువారం హైదరాబాదులో అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించేందుకు ఆ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి గురవారం విలేకరులతో మాట్లాడారు.

శిలాజ ఇంధనాలు వాడని దేశంగా భారత్‌ను మార్చాలన్నదే ప్రధాని మోడీ ఉద్దేశ్యమని, సంప్రదాయేతర ఇంధన వరులపై పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పెట్రోలు, డీజిల్ వంటి వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. దాని వల్ల భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయన్నారు.

జర్మనీ మాదిరిగా ఇక్కడ కూడా ఇళ్ల కప్పులను సౌర విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించుకునేలా జాతీయ విధానంలో మార్పులు చేస్తామన్నారు. అమెరికాకు అత్యధికంగా సైన్స్, టెక్ాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులు చదివేందుకు వెళ్తున్న పది నగరాల్లో నుండే భారత్ నుండే 8 ఉన్నాయన్నారు.

 హర్షవర్ధన్

హర్షవర్ధన్

దక్షిణాది నుండి హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ, చెన్నై, బెంగళూరు ఉన్నాయని, విదేశాల్లో స్థిరపడ్డ శాస్త్రవేత్తలు భారత్‌కు తిరిగి వస్తే వారికి మంచి స్థానం కల్పించడం లాంటి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

 హర్షవర్ధన్

హర్షవర్ధన్

అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో స్టార్టప్ కంపెనీలు సైతం ఎక్కువగా భారతీయులవే అన్నారు. ప్రపంచంలో ఉత్త దేశంగా మారేందుకు భారత్‌కు మంచి అవకాశాలున్నాయన్నారు.

 హర్షవర్ధన్

హర్షవర్ధన్

మహర్షి భరద్వాజ విమానాల గురించి ఏడువేల సంవత్సరాలకు పూర్వమే చెప్పారని కెప్టెన్ ఆనంద్ బోడాస్ ఇటీవల ముంబైలో జరిగిన భారతీయ శాస్త్ర విజ్ఞాన కాంగ్రెస్ 102వ వార్షికోత్సవ కార్యక్రమంలో అన్నారు.

 హర్షవర్ధన్

హర్షవర్ధన్

దీనిపై కొందరు ప్రశ్నించడంతో కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పూర్వీకులు సాధించిన ఘనతలను చెప్పుకోవడంలో తప్పులేదన్నారు.

English summary
Union science and technology minister Harsh Vardhan on Thursday defended a paper presented at the recently concluded Indian Science Congress that claimed aviation technology was developed in ancient India between 6,000 and 7,000 BC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X