వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కైలాష్ సత్యార్థి ఇంట్లో భారీ చోరీ: నోబెల్ బహుమతి అపహరణ

సామాజిక ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా లభించిన నోబెల్ బహుమతిని కూడా దొంగలు దోచుకుపోయారు. నోబెల్ బహుమతితోపాటు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

సామాజిక ఉద్యమకారుడైన సత్యార్థి.. బాలల హక్కుల కోసం విశేష కృషి చేశారు. 1980లోనే బచ్‌పన్ బచావో ఆందోళన్ స్థాపించి 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఎంతో కృషి చేశారు.

Nobel Prize replica stolen from Kailash Satyarthi's home

ఆయన విశేష కృషిని గుర్తించి 2014లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. పాకిస్థాన్ సాహస బాలిక మాలాల యూసఫ్ జాయ్‌తో సంయుక్తంగా ఆయన ఈ బహుమతిని అందుకున్నారు.

కాగా, సత్యార్థి ఇంట్లో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సత్యార్థి అమెరికా పర్యటనలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Nobel laureate Kailash Satyarthi 's house in New Delhi was burgled in the early hours of Tuesday, police have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X