వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం మాట్లాడారు: ప్రధాని మోడీని కలిసిన నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురుస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోడీ నివాసంలో కలిసిన బెనర్జీ పలు విషయాలపై మాట్లాడారు. నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. పలు సబ్జెక్ట్‌లపై ఇద్దరూ చర్చించినట్లు మోడీ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. భారత దేశం అభిజీత్ బెనర్జీ సాధించిన ఈ గొప్ప విజయంపట్ల గర్విస్తోందని చెప్పారు ప్రధాని . ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని అభిజీత్‌ను వరించాలని మోడీ ఆకాంక్షించారు.

ఇదిలా ఉంటే నోబెల్ పురస్కారంకు ఎంపికైన తర్వాత అభిజీత్ బెనర్జీ భారత్‌కు రావడం ఇది తొలిసారి. ఇక మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకుని తన తల్లిని కలుస్తారు. కోల్‌కతాలో రెండు రోజుల పాటు గడపనున్నారు అభిజీత్. అభిజీత్ బెనర్జీ నోబెల్ ప్రైజ్‌ను గెలిచిన తర్వాత ఇటు అధికారిక బీజేపీ అటు విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిన న్యాయ్ పథకంపై అభిజీత్ బెనర్జీ ప్రశంసలు కురిపించారు. దీనిపై కౌంటరిచ్చింది బీజేపీ. అభిజీత్ బెనర్జీకి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యాయ్ పథకం గురించి ప్రస్తావించారు. దీంతో అభిజీత్ లెఫ్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తి అని బీజేపీ విమర్శించింది.

Nobel Prize winner Abhijit banerjee meets PM Modi at his residence

అభిజీత్ బెనర్జీ లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రజలు తిరస్కరించిన న్యాయ్ పథకాన్ని అభిజీత్ ప్రశంసించడం సరైనది కాదని అన్నారు. దీంతో కొద్ది రోజులు కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అయితే అభిజీత్ ప్రధానిని కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అభిజీత్ బెనర్జీ జేఎన్‌యూ తనకు భారత రాజకీయాల గురించి పాఠాలు నేర్పగా... తాను పుట్టి పెరిగిన కోల్‌కతా నగరం భారత పేదరికం అంటే ఏమిటో చూపించిందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

English summary
Nobel Prize winner Abhijit Banerjee met Prime Minister Narendra Modi at the PM's residence. Earlier this month Banerjee won the 2019 Nobel Prize for Economics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X