వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రేజీగా కేజ్రీవాల్ చెంప పగుల‌గొట్టింది ఇత‌నే: క్రేజ్ కోస‌మేన‌ట‌!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఫొటోలో కొంటెగా న‌వ్వుతూ క‌నిపిస్తోన్న ఈ వ్య‌క్తి పేరు సురేష్‌. ఢిల్లీ నివాసి. ఈ నెల 4వ తేదీన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా దేశ రాజ‌ధానిలో మోతీన‌గ‌ర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ చెంప‌ను పగులగొట్టి ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్నాడు. ఆరురోజుల త‌రువాత తెరమీదికి వ‌చ్చాడు. తీరిగ్గా సారీ చెబుతున్నాడు.

<strong>జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనం</strong>జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనం

ముఖ్య‌మంత్రిని ఉద్దేశ‌పూర‌కంగా కొట్ట‌లేద‌ని వివ‌ర‌ణ ఇస్తున్నాడ‌త‌ను. ఎందుక‌లా కొట్టానో తెలియ‌ద‌ని అంటున్నాడు. తాను ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ను కాద‌ని, సాధార‌ణ ఓట‌ర్‌న‌ని సురేష్ స్ప‌ష్టం చేశారు. చెంప‌దెబ్బ వెనుక ఎలాంటి కుట్ర లేద‌ని, రాజ‌కీయ కార‌ణాలు లేవ‌ని చెప్పాడు.

Nobody asked me to do this: Man who slapped Delhi CM Arvind Kejriwal

ఈ నెల 4వ తేదీన మోతీన‌గ‌ర్‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌ను ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నం పైకి ఎక్కి మ‌రీ చెంప ప‌గుల గొట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో అత‌ణ్ని ఆప్ కార్య‌క‌ర్త‌లు దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయ రంగును కూడా పులుముకొంది. దీని వెనుక భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌మేయం ఉందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. తాము ఓడిపోతున్నామ‌నే అక్కసుతోనే ఇలా దాడి చేయించార‌ని ఆరోపించారు.

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించారు. ఇంచుమించు- కేజ్రీవాల్ చేసిన ఆరోప‌ణ‌నే ఆయ‌నా చేశారు. ఎక్క‌డికి పోతున్నాం మ‌నం..రాజ‌కీయాల్లో భౌతిక దాడుల‌కు తావు లేదు..మోడీ ప‌రిపాల‌న ఇలా తగ‌ల‌డింది.. అంటూ వ్యాఖ్యానించారు.

English summary
Suresh, the man who slapped Delhi Chief Minister Arvind Kejriwal during a roadshow on May 4, expressed regret over his act. "I don't know why I slapped Arvind Kejriwal. I regret it," Suresh said. Suresh also claimed that he is not affiliated to any political party. "I am not affiliated to any political party. Nobody asked me to do this. Police did not misbehave with me. They only said what I did was wrong," he added. On May 4, AAP chief Kejriwal was slapped by a man (later identified as Suresh) in Moti Nagar in West Delhi while campaigning for the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X