వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ స్టుపిడ్ కోర్టు నన్ను విచారించలేదు...! స్వామి నిత్యానంద వివాస్పద వ్యాఖ్యలు వీడీయో

|
Google Oneindia TeluguNews

Recommended Video

Nithyanantha's Kailasa : A Tamil Actress Going To Be The Prime Minister || Oneindia Telugu

అత్యాచారం, మరియు కిడ్నాప్ కేసులను ఎదుర్కొంటున్న నిత్యానందా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వివాదస్పద వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈనేపథ్యంలోనే తనను తాను ఒక పరమశివ చెప్పుకుంటున్న నిత్యానంద, నిజాన్ని సత్యాన్ని వెల్లడించి ఆయన చిత్తశుద్దిని చాటుకుంటానని అన్నారు. దీంతో తానోక పరమ శివ అని...నన్ను ఏ స్టుపిడ్ కోర్టు కూడ ఏం చేయలనేదని అన్నారు. నా దగ్గరకు రావద్దని ఎవరు చెప్పిన నమ్మవద్దని, నేను మీ వెంట ఉంటానని అన్నారు. తలపాగ ధరించి గతాని కంటే భిన్నంగా నిత్యానందా ఆ వీడియోలో కనిపించారు. కాగా ఈ వీడియో గత పదిహేను రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 2010 నుండి నిత్యానందకు కష్టాలే

2010 నుండి నిత్యానందకు కష్టాలే

2010 నటి రంజిత రాసలీలల్లో మునిగితేలిన వీడియో ఒకటి బయటకు రావడంతో అప్పటి నుండి నిత్యానందా ఏదో వార్తల్లోకి ఎక్కుతున్నాడు. రాసలీలల వీడియో అనంతరం కటకటాల్లోకి వెళ్లి వచ్చిన ఆయనపై ముఖ్యంగా కర్నాటకలో అత్యాచారంతో పాటు, కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు గత నెలలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన ఆశ్రమం నుండి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం కావడంతో నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దీంతో పాటు పిల్లలను కిడ్నాప్ చేసి వారితో చట్టవ్యతిరేకమైన పనులు చేయించినట్టు ఆరోపణలు కూడ ఎదుర్కోన్నాడు.

దేశం విడిచి పారిపోయిన నిత్యానంద

దేశం విడిచి పారిపోయిన నిత్యానంద

ఇన్ని ఆరోపణలు , కేసుల నేపథ్యంలోనే దేశం విడిచి పారిపోయాడు. తానే కైలాస అనే ఓ దేశాన్ని సృష్టిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఆయన పేర్కోన్న కైలస నగరం ఎక్కడ ఉందో కూడ పోలీసులు ఇప్పటి వరకు కనుగొనలేక పోయారు. అయితే అంతర్జాతీయ మీడీయా వెల్లడించిన వివరాలు ప్రకారం నిత్యానంద ఉన్న ప్రాంతం ఈక్వేడర్‌కు దగ్గరలో ఉన్నట్టు పలు కథనాలు వెల్లడించారు. అయితే ఈ వార్తలను ఈక్వేడర్ ప్రభుత్వం ఖండించింది. స్వామీజీ పేరుతో తమ వద్ద ఎవరు భూములు కొనలేదని,ఆయనకు ఎలాంటీ ఆశ్రయం కల్పించలేదని పేర్కోన్నారు.

పాస్‌పోర్టు సీజ్ చేసిన విదేశాంగ శాఖ

పాస్‌పోర్టు సీజ్ చేసిన విదేశాంగ శాఖ

అయితే దేశం విడిచి పారిపోయిన నిద్యానంద కోసం పోలీసులు ఓవైపు గాలిస్తుండగా... మరోవైపు తాజా పాస్‌పోర్ట్‌ ను రద్దు చేసింది. అయితే తాజాగా మరో పాస్‌పోర్టు కోసం ధరఖాస్తు నిత్యానంద ధరఖాస్తు చేసుకోవడంతో దాన్ని కూడ తిరస్కరించారు. పలు కేసుల్లో ఉన్న నిత్యానందకు పాస్‌పోర్టును ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను ఓ సోంత దేశాన్ని నిర్మించుకుంటున్నట్టు ,ఇది హైందవ సిద్దాంతాలను అనుసరిస్తూ.. నిర్మాణం జరుగుతుందని అన్నారు. భక్తులు ఎవరు కూడ ఆందోళన చేందవద్దని తనపై విశ్వాసం ఉంచాలని, వారిని నేను కాపాడతానని పేర్కోన్నారు.

English summary
Nithyananda, who has been accused of rape and sexual abuse, surfaced in a video recently, declaring that "nobody can touch me" and that no court can prosecute him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X