వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం డిమాండ్, బళ్లారి శ్రీరాములు మద్దతు, బీజేపీ క్లారిటీ, పరిష్కారం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చెయ్యడానికి మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఇప్పటికే మద్దతు ఇచ్చారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యడానికి తాము అంగీకరించమని, అలా చేస్తే సమస్యలు పరిష్కారం కావని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అన్నారు. బుధవారం శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప ప్రత్యేక రాష్ట్రం విషయంలో క్లారిటీ ఇచ్చారు.

బళ్లారి శ్రీరాములు మద్దతు

బళ్లారి శ్రీరాములు మద్దతు

కర్ణాటకలో ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో ఉత్తర కర్ణాటక అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించకుంటే ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని, తాను మద్దతు ఇస్తానని మాజీ మంత్రి, మాళకాల్మూరు బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు చెప్పారు.

ఎందుకుప్రత్యేక రాష్ట్రం అందుకే !

ఎందుకుప్రత్యేక రాష్ట్రం అందుకే !

ఉత్తర కర్ణాటక అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించకుంటే ప్రత్యేక రాష్ట్రం నినాదం తెరమీదకు తెస్తామని అనేక పార్టీల నాయకులు బహిరంగంగా చెప్పారు. అన్ని ప్రభుత్వాలు ఉత్తర కర్ణాటకను చిన్నచూపు చూస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్రంగా విభజిస్తే మేమే ఈ ప్రాంతాలను అభివృద్ది చేసుకుంటామని గట్టిగా చెప్పారు.

గోవా మహాదాయి దెబ్బ !

గోవా మహాదాయి దెబ్బ !

మహాదాయి నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం తీరుతో పోరాటం జరిగిన సందర్బంలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం నినాదం తెరమీదకు వచ్చింది. తరువాత మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఈ నినాదం తెరమీదకు వచ్చింది.

మాజీ సీఎం ఆదేశం

మాజీ సీఎం ఆదేశం

ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని ఎవ్వరూ మాట్లాడకూడదని యడ్యూరప్ప కర్ణాటక బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంలో ఏ పార్టీ నాయకులు అయినా సరే ప్రత్యేక రాష్ట్రం నినాదం తెరమీదకు తెస్తే తాము మద్దతు ఇవ్వమని యడ్యూరప్ప తేల్చి చెప్పారు.

కొడుగు సమాజం డిమాండ్

కొడుగు సమాజం డిమాండ్

చాల కాలం నుంచి కొడుకు సమాజం ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక కొడుగు రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఇప్పటికే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే కర్ణాటకను ముక్కలు కానివ్వమని కన్నడ సంఘాలు అంటున్నాయి.

English summary
BJP Karnataka state president said that There is no consensus on the separate state issue. Nobody should talk about a separate state. If there is no development, work for the development of North Karnataka but separate state is not a solution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X