వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద మిస్సయ్యింది.. ఇప్పుడు ఫోన్... కిడ్నాపర్లు ఏం చెప్తున్నారో తెలుసా!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద తప్పిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతం లేదు. పోలీసులు గాలించని ప్రదేశం లేదు. ఇక ఆ చిట్టి తల్లి ఏమైందని .. ఆమె ఊహల్లో జీవిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవల కొందరు దుండగులు వారి పాప తమ వద్ద ఉందని చెప్పడంతో ఆందోళన చెందారు. అదేంటి మూడేళ్ల కింద తప్పిపోయిన పాప ఉండటమేంటి అని మదనపడ్డారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు .. రోజుకు పదిసార్లు ఫోన్ చేసి భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎపిసోడ్‌ను చేధించే పనిలో నిమగ్నమయ్యారు.

స్పామ్ కాల్ ..

స్పామ్ కాల్ ..

నోయిడాలోని సెక్టార్ 22లో సంజయ్ రావత్ తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. వీరికి కశిష్ రావత్ అనే నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే నోయిడాలోని తన ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి తప్పిపోయింది. 2016లో అంటే మూడేళ్ల కింద తమ కూతురు కనిపించకపోవంతో ఆ పేరెంట్స్ తల్లడిల్లిపోయారు. ఆమె కోసం వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా గాలించారు. నోయిడా, గజియాబాద్, ఢిల్లీ, బులంద్ సహర్, హపూర్, మీరట్ తదితర ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. కానీ చిన్నారి ఏమైందని విషయం తెలయలేదు.

కిడ్నాపర్ల్ కాల్ ..

కిడ్నాపర్ల్ కాల్ ..

కాలం గడిచింది. మూడేళ్లు అయిపోయాయి. కానీ ఈ నెల 8న సంజయ్‌కు ఒక ఫోన్ వచ్చింది. కశిష్ తమ వద్ద ఉందని, రూ.10 లక్షలు ఇస్తే సజీవంగా అప్పగిస్తామని చెప్పడంతో .. రావత్ నోట మాట రాలేదు. అదేంటి మూడేళ్ల కింద తప్పిపోయిన తమ చిన్నారి వారి వద్ద ఉండటం ఏంటని ఆలోచించడు. వారి మాటలను విశ్వసించలేదు. కానీ అప్పటినుంచి రోజు 10 సార్లు ఫోన్ చేయడంతో అనుమానం వచ్చింది. అంతేకాదు కిడ్నాపర్లు రోజుకో నంబర్ ద్వారా ఫోన్ చేస్తున్నారు. తమది పంజాబ్ అని చెప్తున్నారు. తనకు వస్తున్న ఫోన్ కాల్ గురించి పోలీసులు ఫిర్యాదు చేశారు రావత్. అయితే తమ కూతురు మీ వద్ద ఉందని ఎలా నమ్మాలి .. ఫోటో చూపాలని కోరితే మాత్రం అందుకు వారు నిరాకరించారు.

చేధిస్తాం ..

చేధిస్తాం ..

రావత్ కేసును పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కిడ్నాపర్ల ఫోన్ ఎక్కడినుంచి చేస్తున్నారు తెలుసుకున్నారు. వారు చెప్పేది పంజాబ్ కానీ .. వారికి తెలంగాణ, పశ్చిమబెంగాల్ నుంచి ఫోన్లు వస్తున్నట్టు గుర్తించారు. రావత్ అంశం డిఫరెంట్, ఈ కేసు విచారణ సాగుతుందని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసు మిస్టరీని అతి త్వరలోనే ఛేదిస్తామని స్పష్టంచేశారు.

English summary
On July 8, Sanjay Rawat, a resident of Sector 22 in Noida received a call from an unknown number. The caller demanded that Rawat pay him a ransom in return for his daughter Kashish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X