వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియలయ్యాక ఇంటికొచ్చింది: చనిపోయిందెవరు,, ఏమైందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

నోయిడా: చనిపోయిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఓ వివాహిత ఇంటికి తిరిగి వచ్చింది. వివాహిత మరణానికి భర్తే కారణమని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మరణానికి భర్త కారణమని తేల్చారు అయితే అదే సమయంలో వివాహిత ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో రాజ్, సర్వేష్ దంపతులు తమ కూతురు నీతూ అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఆమె అదృశ్యం కావడానికి భర్తే కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే నీతూ లాంటి మృతదేహం లభించడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కూతురు తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంత్యక్రియలు చేశాక ఇంటికొచ్చింది

అంత్యక్రియలు చేశాక ఇంటికొచ్చింది

గ్రేటర్ నోయిడాలోని రాజ్, సర్వేష్ దంపతుల కూతురు నీతూ ఏప్రిల్ 6వ తేదిన అదృశ్యమైంది. ఆమె అదృశ్యం కావడానికి భర్త రామలక్ష్మణ్ కారణమని నీతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏప్రిల్ 24వ తేదిన తీవ్ర గాయాలతో పడి ఉన్న మృతదేహం గురించి నీతూ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.ఆ మృతదేహం తమ కూతురిదేనని భావించి వారు అంత్యక్రియలు నిర్వహించారు.

27 రోజుల తర్వాత ఇంటికి నీతూ

27 రోజుల తర్వాత ఇంటికి నీతూ


నీతూ చనిపోయిందని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, అందరిని ఆశ్చర్యపరుస్తూ నీతూ 27 రోజుల తర్వాత ఇంటికి చేరుకొంది.తానే నీతూ అంటూ పోలీసులను ఆశ్రయించింది. కుటుంబసభ్యులు కూడ నీతూ ఇంటికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

నీతూ భర్తకు సంబంధం లేదని తేల్చిన పోలీసులు

నీతూ భర్తకు సంబంధం లేదని తేల్చిన పోలీసులు

నీతూ అదృశ్యం కావడానికి భర్తే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. అయితే నీతూ అదృశ్యానాకి ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో నీతూ భర్తను పోలీసులు వదిలేశారు.దీంతో కేసు మళ్ళీ మొదటికొచ్చింది.

పూరణ్‌తో ఉంటున్న నీతూ

పూరణ్‌తో ఉంటున్న నీతూ


నీతూ తల్లిదండ్రులు నిర్వహించే కిరాణ దుకాణానికి పూరణ్ అనే వ్యక్తి వచ్చేవాడు. సిగరెట్ల కోసం ప్రతి రోజు ఈ షాపుకు వచ్చేవాడు. అయితే కొంత కాలంగా ఈ దుకాణానికి అతను రావడం మానేశాడు. ఈ విషయాన్ని నీతూ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఈ విషయమై పూరణ్ ను పోలీసులు విచారించారు.ఈ విచారణలో నీతూ తనతోనే ఉంటుందని ఆయన అంగీకరించాడు.అయితే అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే విషయం తేలాల్సి ఉంది.

English summary
A strange incident took place in Noida when a 25-year-old woman who was assumed dead, identified and cremated by her family, walked alive at her residence after 27 days. It was nothing less than a miracle for the family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X