వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ సోమవారం జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం అదే రోజు నామినేషన్ల స్క్రూటినీ,ఉపసంహరణ ఉంటుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే 21న పోలింగ్ జరుగుతుంది. అయితే ఎప్పటి లాగే ఈసారి కూడా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమవడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.

Nomination process for BJP National Prez to be held on Monday JP Nadda to succeed Amit Shah

అమిత్ షా స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎన్నికవడం దాదాపుగా ఖాయమైపోయింది. అధ్యక్షుడికి ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతలు,కేంద్రమంత్రులు ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ సీనియర్ నేత రాధామోహన్ సింగ్‌కు అప్పగించారు. ఆదివారం కేంద్రమంత్రులు,బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశమై అధ్యక్షుడి ఎన్నికపై చర్చించారు.

కాగా,బీజేపీ అధ్యక్షుడిగా ఐదున్నరేళ్లుగా కొనసాగుతున్న అమిత్ షాను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడంతో.. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీ మునుపెన్నడూ లేని రీతిలో దేశవ్యాప్తంగా తమ సత్తా చాటింది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఒకరకంగా అమిత్ షా హయాం బీజేపీకి మహర్దశ అనే చెప్పాలి. ఇప్పుడాయన స్థానంలో కొత్తగా వచ్చే అధ్యక్షుడిపై కూడా అంతే స్థాయిలో అంచనాలు ఉండటం సహజం. ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జేపీ నడ్డాయే అందుకు సరైన వ్యక్తి అని భావిస్తున్నారు.

బీజేపీతో జేపీ నడ్డాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చిన నడ్డాకు.. ఆర్ఎస్ఎస్‌ సన్నిహితుడిగా పేరుంది. అలాగే వివాదరహితుడిగా క్లీన్ ఇమేజ్‌ కూడా ఉండటం ఆయనకు కలిసొచ్చింది. చాలాకాలంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగానూ ఆయన కొనసాగుతున్నారు. మోదీ మొదటి దఫా ప్రధాని అయినప్పుడు జేపీ నడ్డా కేంద్రమంత్రిగానూ పనిచేశారు.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపుకు ఆయన కృషి చేశారు.బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ఇంచార్జిగా వ్యవహరించిన ఆయన.. బీఎస్పీ-ఎస్పీల కూటమిని నిలువరించి తమ పార్టీకి 62 స్థానాలు దక్కడంలో కీలక పాత్ర పోషించారు. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన జేపీ నడ్డాను గతేడాది జులైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడే.. భవిష్యత్తులో ఆయన అధ్యక్ష పదవిని కూడా చేపట్టవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఇప్పుడాయన అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.

English summary
The BJP is set to get its new national president in place of Amit Shah on Monday, with its working president J P Nadda expected to be elected to the post unopposed. The process of nomination for BJP National President will be held on Monday at party headquarters in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X