వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య అనుమతి లేకున్నాసెక్స్ రేప్ కిందకు రాదు: హైకోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: భార్య అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొంటే వైవాహిక అత్యాచారం కాదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే నోటి ద్వారా, అసహజ మార్గాల్లో జీవిత భాగస్వామితో శృంగారం కోరుకొంటే అది క్రూరత్వం కిందకే వస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది.

భార్య అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారమేనని గతంలో పలు కోర్టులు తీర్పులు ఇచ్చాయి. కానీ, ఆ తీర్పుకు భిన్నంగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఉంది. తన భర్త తనపై అత్యాచారం చేశాడని, అంతేకాకుండా హింసించాని ఓ మహిళా డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

ఓ వ్యక్తి , జంతువు మధ్య జరిగే లైంగిక చర్య, ఇద్దరు పురుషుల మధ్య జరిగే అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యలు విపరీతమైన ప్రవర్తనలు మిగిలిన సందర్భాలన్నీ కూడ ఐపీసీ సెక్షన్ 377 కిందకు రావని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది.

Non-consensual sex with wife not a rape: Gujarat High Court

తనకు ఇష్టం లేకున్నా తన భర్త తనతో ఓరల్ సెక్స్‌కోసం బలవంతం చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కూడ కోరింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఈ ఫిర్యాదును తిరస్కరిస్తూ సెక్షన్ 376 కింద అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని జస్టిస్ జేబీ పార్టీవాలా చెప్పారు.అసహజ లైంగిక ఆరోపణలతో సెక్షన్ 377 కింద ఆమె పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది.

English summary
The Gujarat High Court on Monday observed that non-consensual intercourse by a husband cannot be dubbed as rape. However, it also stated that subjecting his married partner to have oral or unnatural sex was akin to cruelty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X