వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు: గాంధీయేతరులు కాంగ్రెస్ చీఫ్, వాద్రా అవినీతి ఆరోపణలపై కూడా..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ తురుపు ముక్క, యువ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి పీఠంపై కామెంట్స్ చేశారు. గాంధీ కుటుంబీకులు కాక.. గాంధీయేతరులు కాంగ్రెస్ చీఫ్ పదవీ చేపట్టాలని అభిలషించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసి దూరంగా ఉండగా.. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీ చేపట్టారు.

ప్రియాంక కామెంట్స్‌తో కలకలం..

ప్రియాంక కామెంట్స్‌తో కలకలం..


అనారోగ్యం వల్ల పార్టీ అధ్యక్ష పదవీని రాహుల్ గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు. కొందరు నేతలు కూడా రాహుల్ తిరిగి పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంగీకరించడం లేదు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపింది గాంధీ కుటుంబీకులేనని.. ఇక గాంధీయేతరులు అధ్యక్ష పదవీ చేపట్టాలని ప్రియాంక కోరారు. ఇదే విషయాన్ని రాజీనామా చేసిన తర్వాత రాహుల్ కూడా చెప్పారని ప్రస్తావించారు. ఇతరులు పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టడం ద్వారా.. పార్టీ కొత్త మార్గంలో నడుస్తోందని ఆమె ఆకాంక్షించారు.

కొత్త మార్గంలో వెళ్లొచ్చు..

కొత్త మార్గంలో వెళ్లొచ్చు..

ఇదివరకు సాంప్రదాయబద్దంగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా పార్టీ పరాజయం పాలై ఉండొచ్చని పేర్కొన్నారు. కొత్త విధానాలను కాంగ్రెస్ పార్టీ మెల్లగా అర్ధం చేసుకుంటుందని ప్రియాంక అంగీకరించారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వివరించారు.గాంధీయేతరులు పార్టీ పగ్గాలు చేపడితే వారి నేతృత్వంలో తాను పనిచేస్తానని ప్రియాంక తెలిపారు. ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు ప్రియాంక.. ప్రస్తుతం ఇంచార్జీగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. నెక్ట్స్ జనరేషన్ లీడర్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంపై ఇంటర్వ్యూ సందర్భంగా ప్రియాంక ఈ కామెంట్స్ చేశారు.

వాద్రా అవినీతి ఆరోపణలపై స్పందన

వాద్రా అవినీతి ఆరోపణలపై స్పందన

తన భర్త రాబర్ట్ వాద్రాపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలపై కూడా రియాక్టయ్యారు. దీనిపై తన కూతురు, కుమారుడికి అన్నీ విషయాలు వెల్లడించానని తెలిపారు. ఇందులో దాయాల్సిన అవసరం లేదు అని, ఆరోపణలకు సంబంధించి నిజనిజాలు తెలిపానని పేర్కొన్నారు. ఈడీ విచారణ, టీవీ చర్చల ద్వారా పిల్లలకు తెలిసిపోయిందని వివరించారు. బోర్డింగ్ స్కూల్‌లో చదవుతోన్న తన కుమారుడు.. అందరి పిల్లల్లా ఉండటం లేదు అని, చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. తన భర్త తప్పు చేయలేదని స్పష్టంచేశారు.

English summary
congress general secretary priyanka gandhi vadra has said a non gandhi should lead the party. as sought by rahul gandhi after he resigned from the president post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X