వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్ సంక్షోభం, గ్యాస్ పెంపు: మోడీపై పొన్నాల ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Non-subsidised LPG hiked by Rs.16.50 a cylinder
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాయితీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సిలిండర్‌కు రూ.16.50 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. అయితే ఈ పెంపుకు ఇరాక్ సంక్షోభం కారణమని చెబుతున్నారు. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌ల పైన, సబ్సిడీ పరిమితి మించిన సిలిండర్ల పైన ఈ పెంపు ఉంటుంది.

కాగా, ధరలు పెరిగిన నేపథ్యంలో రాయితీ సిలిండర్ల ధరలు... ఢిల్లీలో రూ.922.50, ఉత్తర ప్రదేశ్‌లో రూ.906 ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) తెలిపింది. స్థానిక పన్నులతో కలిపి కోల్‌కతాలో రూ.966, ముంబైలో రూ.949.50, చెన్నైలో రూ.924 ఉంటుంది.

మోడీపై మండిపడ్డ పొన్నాల

సబ్సిడీయేతర సిలిండర్ల పెంపు నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రధాని నరేంద్ర మోడీ పైన మండిపడ్డారు. ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ నెల తిరక్కుండానే ద్రవ్యోల్భణం పెంచే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

పొన్నాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి నెల రోజులు అయిన్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తాము ఆంటోని కమిటీ ముందు పార్టీ పరిస్థితిని చర్చించేందుకు ఢిల్లీ వెళ్తుననట్లు చెప్పారు.

English summary
Price of non-subsidised cooking gas (LPG) was today hiked by ₹16.50 per cylinder and that of jet fuel by over half-a-per cent after international oil prices surged due to the ongoing Iraq crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X