వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెక్ ఇస్తే వద్దన్నారు , చిల్లర ఇచ్చి చుక్కలు చూపాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా :పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం ఒక్కోరికి ఒక్కో రకంగా ఇబ్బందిపెట్టింది. పెద్ద నగదు నోట్ల రద్దు అమల్లోకి రావడంతో చిన్న నో్ట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. అత్యవసర చికిత్సలు కోసం ఆసుపత్రులకు వచ్చే వారు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.రద్దు చేసిన నగదు స్థానంలో చిల్లర ఇచ్చి ఆసుపత్రి యజమానికి చుక్కలు చూపాడు ఓ వ్యక్తి.

డెంగీ వ్యాధితో కోల్ కోతాలోని న్యూ అలిపోలె లోని బిపిపొద్దార్ ఆసుపత్రిలో సుకాంత చౌలే చేరారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయనకు జ్వరం తగ్గింది. ఈ నెల 9వ, తేదిన ఆయనను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో ఖర్చుల కోసం సుమారు 40 వేల రూపాయాలను చెల్లించాల్సి ఉంది.ఈ బిల్లులను చెల్లించేందుకు గాను తన వద్ద కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నగదు నోట్లే ఉన్నాయి. ఈ నగదును తీసుకోవడనికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు.

not accept cheque given 40 thousand rupees coins

చెక్ ఇస్తానని చెప్పినా ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదు.అయితే సుకాంత ఏం చేశాడో తెలియదు ఆయన స్నేహితులు, బందువులు, తమ దగ్గర ఉన్న పది, 50, ఒకటి , 20 వంద రూపాయాలతో పాటు చిల్లర నాణెలలను సుకాంత కుటుంబసభ్యులకు అందజజేశారు.40 వేల రూపాయాల చిల్లరను తీసుకొన్న కుటుంబసభ్యులు పెద్ద గొనే సంచిని తీసుకొని ఆసుపత్రికి చేరుకొన్నారు.

ఆసుపత్రి బిల్లు కింద 40 వేల రూపాయాల చిల్లరను చెల్లించారు. అయితే ఆసుపత్రి యాజమన్యం చిల్లరను తీసుకోవడానికి నిరాకరించింది. చెక్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన సుకాంత కుటుంసభ్యులు పోలీసులకు ఫోన్ చేస్తామని హెచ్చరించారు. చేసేది లేక ఆసుపత్రి యాజమాన్యం ముగ్గురు సిబ్బందితో 3 గంటలకు పైగా చిల్లరను లెక్కించిన తర్వాత సుకాంతను డిశ్చార్జ్ చేశారు.

English summary
sukanta admitted poddar hospital in kolkatta for treatment dengue. arter days dengue cure. 9 th of November sukanta discharge time. hospital fees around 40 thousand rupees. sukanta prepare topay 500, 1009 rupees of currency hospital not accept banned currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X