• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్మీ కొత్త ఆయుధాలపై చర్చకు నో -టైమ్ వేస్ట్ అంటూ డిఫెన్స్ కమిటీ భేటీ నుంచి రాహుల్ గాంధీ వాకౌట్

|

చైనా దురాక్రమణ, లదాక్ లో మనసైనికుల మరణాలు, సరిహద్దులో పనిచేస్తోన్న సైనికులకు అత్యాదునిక ఆయుధాలు అందజేత తదితర అంశాలపై మోదీ సర్కారు అబద్దాలాడుతోందని, అసలు విషయం మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుసరుసలాడారు. కీలకాంశాలపై చర్చించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి బుధవారం ఆయన వాకౌట్ చేశారు.

ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలుఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలు

సైన్యానికి సంబంధించిన కీలక అంశాలను చర్చించేందుకు బుధవారం రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ భేటీ అయింది. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ఆర్మీ తరఫున చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హాజరయ్యారు. బీజేపీ ఎంపీ జువల్ ఓరమ్ చైర్మన్ గా ఉన్న ఈ కమిటీ సమావేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు ధరించే యూనిఫారాల్లో మార్పులపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కమిటీ సభ్యుడైన రాహుల్ గాంధీకి సర్కారు తీరుపై చిర్రెత్తుకొచ్చింది..

Not allowed to raise China border issue, Rahul Gandhi walks out of Defence Parl panel meet

దుస్తులపై చర్చ జరుగుతుండగా, రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని.. దుస్తుల కంటే ముందుగా మనం ఆర్మీకి అందించాల్సిన అత్యాధునిక ఆయుధాల గురించి మాట్లాడాలి. అవతల మన జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. పార్లమెంటరీ కమిటీలోని రాజకీయ నాయకత్వం.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించాచాలని రాహుల్ పట్టుపట్టారు. కానీ..

వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్

రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువల్ ఓరమ్ (బీజేపీ).. రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించలేదు. ముఖ్యమైన అంశాలను వదిలేసి జరిపే చర్చలో పాల్గొనడం నిజంగా టైమ్ వేస్ట్ అంటూ రాహుల్ ఆగ్రహంతో మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ఆయ‌నతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, మ‌రో స‌భ్యుడు రాజీవ్ స‌త‌వ్ కూడా మీటింగ్ మధ్యలోనే బయటికి వెళ్లిపోయారు.

  Heavy Rainfall Likely In Tamil Nadu, Kerala, Puducherry, Spell To Last Till Dec 22 - IMD

  భేటీ ముగిసిన తర్వాత డిఫెన్స్ కమిటీ చైర్మన్ జువల్ ఓరమ్ మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఎజెండాలో లేని అంశాలను లేవనెత్తారని, కాబట్టే తాను అడ్డు చెప్పానని, కమిటీ చైర్మన్‌గా తనకు ఆ అధికారం ఉందని చెప్పారు. కమిటీ సభ్యుల్లో రాహుల్ గాంధీ అయినా, వేరొకరైనా ఈ విధంగా ఎజెండాలో లేని అంశాలను లేవనెత్తినపుడు, అది మానుకోవాలని తాను కోరవచ్చుని ఓరమ్ చెప్పారు.

  English summary
  Congress leader Rahul Gandhi on Wednesday walked out of a meeting of the Parliamentary Committee on Defence. Rahul Gandhi left the meeting after he was not allowed to speak when he sought to raise the issues of Chinese aggression and better equipping the soldiers at the border in Ladakh. 'Wasting Crucial Time Discussing Uniform, rahul says
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X