వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుగు భూమి కూడా ఇవ్వబోం, ధీటుగా జవాన్ల జవాబు, ఆల్ పార్టీ మీట్‌లో ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

భారత భూభాగం నుంచి ఒక అడుగు కూడా ఇవ్వబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు కవ్విస్తోన్న చైనాకు జవాన్లు ధీటుగా జవాబిస్తున్నారని పేర్కొన్నారు. పొరుగుదేశాల కవ్వింపు చర్యలను నిలువరించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చానని పేర్కొన్నారు. సరిహద్దులో పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తునన్నానని చెప్పారు. లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్ వద్ద గస్తీ పెంచామని.. హెలికాప్టర్, మిస్సైల్స్ మొహరించామని తెలిపారు.

వాస్తవాధీన రేఖపై పూర్తి నిఘా పెట్టామని ప్రధాని తెలిపారు. భారత్ వద్ద ఫైటర్ జెట్లు, కొత్త హెలికాఫ్టర్లు ఉన్నాయని మోదీ చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, అయితే దేశ సార్వభౌమత్వంపై రాజీ పడబోదని చెప్పారు. జాతి హితమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా జవాన్లు భారత జవాన్లపై దాడి చేయడంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Not an inch of land has been lost, PM modi on all-party meet..

భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేరని, మా పోస్టులను ఎవరూ ఆక్రమించలేరు అని మోడీ స్పష్టంచేశారు. తాము శాంతిని కోరుకుంటామని, కానీ తమ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోబోమని తేల్చిచెప్పారు. మోడీ తన ప్రసంగంలో ఎక్కడ చైనా పేరు ప్రస్తావించలేదు కానీ.. చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సమావేశంలో వివిధ పార్టీ నేతలు పాల్గొని ప్రభుత్వానికి మద్దతు. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని సోనియాగాంధీ అనగా.. ఐకమత్యంతో పోరాడుదామని మమతా బెనర్జీ బాసటగా నిలిచారు. గల్వాన్ లోయ వద్ద జరిగిన పరిణామాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రతిపక్షనేతలకు వివరించారు. ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ లేదని, సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని రాజ్‌నాధ్ చెప్పారు.

English summary
Not an inch of land has been lost, PM denies Chinese crossed LAC at all-party meet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X