• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారతీయుల ప్రాణాలపై వ్యాపారమా? -అందరికీ వ్యాక్సిన్లకు ఇంకా 3ఏళ్లు -సీరం సీఈవో అదర్ పూనావాలా

|

కరోనా విలయం అతి తీవ్రంగా కొనసాగుతుండగా వ్యాక్సిన్ల కొరత సర్వత్రా కలకలం రేపుతున్నది. ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న నేపథ్యం ప్రజల్ని మరింత అయోమయానికి గురిచేస్తున్నది. ఇప్పటికే చాలా చోట్ల వ్యాక్సినేషన్ నిలిచిపోగా, తిరిగి ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేకుండాపోయింది. ఈ క్రమంలో కొవిషీల్డ్ తయారీదారు సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా ప్రకటన చేశారు. బెదిరింపులతో భారత్ ను వీడి ప్రస్తుతం లండన్ లో ఉంటోన్న ఆయన టీకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలురఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలు

దేశ ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యాక్సిన్లను ఎన్నడూ ఎగుమతి చేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పష్టం చేశారు. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు, మూడు నెలల్లో పూర్తి కాబోదని తెలిపారు. కోవిడ్-19 కోసం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

 not at cost of Indians, will take 2-3 yrs for fully vaccinated: Serum CEO Adar Poonawalla

అదర్ పూనావాలా మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గతంలో ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడానికి కారణాలను వివరించారు. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, ఎగుమతి చేయడం లేదని తెలిపారు. గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నపుడు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా గతంలో ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపించినట్లు చెప్పారు.

విజయన్ సంచలనం: అల్లుడికి అందలం -కేరళ కొత్త మంత్రులు వీరే -శైలజకు షాక్ -స్పీకర్‌గా ఎంబీ రాజేశ్విజయన్ సంచలనం: అల్లుడికి అందలం -కేరళ కొత్త మంత్రులు వీరే -శైలజకు షాక్ -స్పీకర్‌గా ఎంబీ రాజేశ్

ప్రపంచంలో అత్యధిక జనాభాగల రెండు దేశాల్లో భారత దేశం ఒకటి అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని తెలిపారు. అటువంటి జనాభాగల దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు లేదా మూడు నెలల్లో పూర్తి కాబోదన్నారు. అమెరికా ఫార్మా కంపెనీల కన్నా రెండు నెలలు ఆలస్యంగా తమకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనుమతులు వచ్చాయని, అయినప్పటికీ సీరం ఇన్‌స్టిట్యూట్ 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిందని చెప్పారు. ఉత్పత్తి చేసిన డోసులు, బట్వాడా చేసిన డోసులను పరిశీలిస్తే, సీరం సంస్థ ప్రపంచంలో మూడు అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే,

గత ఒప్పందాల ప్ర‌కారం ఇండియాలోని సీరం సంస్థ టీకాలు అందివ్వ‌డం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌లో వైర‌స్ విజృంభ‌ణ త‌గ్గిన త‌ర్వాత‌.. సీరం సంస్థ కోవాక్స్ కోసం నిబద్ద‌తో టీకాల‌ను అందించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో టీకాల స‌ర‌ఫ‌రా మందిగించింద‌ని, జూలై నాటికి 19 కోట్ల టీకాలు త‌క్కువ‌వుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. కోవాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 124 దేశాల‌కు 6.5 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు. భార‌త్‌లో క‌రోనా ఉదృతి వ‌ల్ల కోవాక్స్ గ్రూపున‌కు టీకాలు కావాల్సిన రీతిలో అంద‌డం లేద‌ని యునిసెఫ్ కూడా పేర్కొన్న‌ది.

English summary
Serum Institute of India (SII) chief Adar Poonawalla on Tuesday said that his company has "never exported vaccines at the cost of the people of India". It will take 2-3 yrs for world to get fully vaccinated against Covid says Serum CEO. who suggests Serum over vaccine supplies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X