not bias the process:కరోనా వ్యాక్సిన్ ప్రయోగ దశను గౌరవించండి, మీడియాకు సీరం సీఈవో రిక్వెస్ట్..
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తోంది..? దాని ఫలితం ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే దీనిని మీడియా సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రయోగం మధ్యలో ఉండగానే రిపోర్ట్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూనవలా స్పందించారు. మరికొద్దిరోజుల్లో ప్రయోగం పూర్తవుతోందని.. అప్పుడే తాము వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు. అప్పటివరకు అరకొర సమాచారాన్ని రిపోర్ట్ చేయొద్దని కోరారు.

క్లినికల్ ట్రయల్స్ కంటిన్యూ..
ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన కోవిషిల్ట్ వ్యాక్సిన్‌ను సీరం ఇనిస్టిట్యూట్ వాలంటీర్లపై ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని అదార్ తెలిపారు. మరో రెండునెలల్లో పూర్తవుతోందని పేర్కొన్నారు. అప్పటివరకు మీడియా ఓపిక పట్టాలని కోరారు. ఒకసారి క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ పూర్తయితే.. తామే సమాచారాన్ని ప్రజలకు అందజేస్తామని వివరించారు. ఇందులో గోప్యానికి తావులేదని చెప్పారు. కానీ మధ్యలో రిపోర్ట్ చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పారు.

ప్రక్రియను గౌరవిద్దాం.. ప్లీజ్
క్లినకల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని.. ప్రక్రియను అందరం గౌరవిద్దాం అని కోరారు. ఈ మేరకు అదార్ ట్వీట్ చేశారు. అయితే ఫస్ట్ డే ఇద్దరికీ టీకా వేశారని.. తర్వాత ఐదుగురు వాలంటీర్లకు టీకా వేశారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ సెకండ్, థర్డ్ స్టేజీ ట్రయల్స్ చేస్తోంది. వ్యాక్సిన్‌ను వాలంటీర్లకు ప్రయోగించేందుకు ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.. సీరం ఇనిస్టిట్యూట్‌కి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

1600 మందికి వ్యాక్సిన్..
18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల 1600 మందికి వ్యాక్సిన్ ప్రయోగిస్తోంది. దేశంలోని ఆరు నగరాల్లో ప్రయోగం కొనసాగుతోంది. విశాఖలో ఆంధ్రా మెడికల్ కాలేజీ, ముంబైలో గల సెత్ జీఎస్ మెడికల్ కాలేజీ, కేఈఎం హాస్పిటల్, పుణెలో గల బీజే మెడికల్ కాలేజ్ అండ్ సాసున్ జనరల్ హాస్పిటల్, ఢిల్లీలో గల ఎయిమ్స్‌లో వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మొదటి రోజు నుంచి 29వ రోజు వరకు 0.5 ఎంఎల్ డోసు గల వ్యాక్సిన్ ఇస్తున్నారు.