వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్! ఉన్నది మీ తాత కాదు.. మోడీ: అంగుళమూ ఇవ్వమంటూ కిషన్, రవిశంకర్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

రాహుల్.. ఆ మాత్రం తెలియదా?

రాహుల్.. ఆ మాత్రం తెలియదా?

చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోడీ నిశ్చబ్దంగా ఉన్నారంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలపై రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. అంతర్జాతీయ అంశాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేయకూడదనే విషయం తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. బాలకోటో వైమానిక దాడులు, 2016 ఉరీ దాడులకు ఆధారాలు కావాలని కూడా గతంలో రాహుల్ అడిగారని విమర్శించారు.

ఇప్పుడున్నది మీ తాత కాదు.. మోడీ

ఇప్పుడున్నది మీ తాత కాదు.. మోడీ


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అంగుళం కూడా చైనాకు పోనివ్వమని అన్నారు. ఒక ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ యువరాజు(రాహుల్) భారతదేశం తన తాత హయాంలో ఉందనుకుంటున్నారేమోనని చురకలంటించారు.

చైనాకు ఒక్క అంగుళం కూడా ఇవ్వం..

చైనాకు ఒక్క అంగుళం కూడా ఇవ్వం..

లడఖ్‌లో రోడ్డు నిర్మించిన విషయం కూడా తనకు తెలియదని 1959, సెప్టెంబర్ 10న పార్లమెంటులో నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వమని, చైనాకు ఒక్క అంగుళం భూమిని కూడా ఇవ్వలేదని, ఇవ్వబోమని స్పష్టం చేశారు.

Recommended Video

#JaganannaChedhodu : Celebrities Big Thanks To AP CM Jagan For Jagananna Chedhodu Scheme
రాహుల్ విమర్శలు ఇలా..

రాహుల్ విమర్శలు ఇలా..

భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనపై ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. లడఖ్‌లో చైనా మన భూభాగంలోకి చొరబడింది. ప్రధాని మాత్రం ఈ విషయంలో నిశ్శబ్దం వహిస్తూ, ఈ అంశంతో సంబంధం లేనట్లుగా ఉన్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, భారత్, చైనా సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే దాదాపు పరిష్కరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరుదేశాల భద్రతా దళాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. మరోసారి చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా ఉన్నామని చైనా పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
Not ceded, will not cede an inch of land to the Chinese: Kishan, ravi shankar counters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X