మేం పోటీ చేయం.. కానీ పంజాబ్ మోడల్ దేశం అంతా కావాలి.. బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలు జోరుగా కసరత్తు చేస్తున్నాయి. షెడ్యూల్ రిలీజ్ కాకున్నా.. కాంగ్రెస్, బీజేపీ క్యాంపెయిన్‌పై ఫోకస్ చేశాయి. అయితే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయమని భారతీయ కిసాన్ యూనియన్ తెలిపింది. ఈ మేరకు హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి తెలిపారు. సుపరిపాలన రావాలని కోరుకుంటున్నామని వివరించారు.

పంజాబ్ మాదిరిగానే.. 2024లో దేశంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. మిషన్ పంజాబ్ లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వివరించారు. వ్యవసాయ చట్టాలు రద్దు మంచి పరిణామం అని తెలిపారు. 2022 పంజాబ్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 2017లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 77 సీట్లు గెలుచుకుని.. బీజేపీ, శిరోమణి అకాళిదల్ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. ఆప్ 20 సీట్లు గెలిచి సంచలనం సృష్టిస్తోంది. అకాళిదల్ 3 సీట్లు గెలుచుకుంది.

Not contesting 2022 Punjab Assembly elections: BKU Haryana chief Gurnam Singh Charuni

ఇటు కాంగ్రెస్ పార్టీకి సిద్దు కొరకరానీ కొయ్యగా మారాడు. సీఎం పదవీపై కన్నేసిన.. అతనికి ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ పదవీ ఇచ్చి.. బుజ్జగించింది. అంతకుముందు అమరీందర్‌తో సిద్దూకు గొడవలు ఉండేవి. దీంతో సిద్దూ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. పీసీసీ పదవీకి కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలు జరిగాయి. ఇద్దరు రాజీనామాలు చేయడంతో.. పరిణామాలే మారిపోయాయి. కానీ సిద్దు వెనక్కి తగ్గగా.. అమరీందర్ మాత్రం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరక.. సొంతంగా పార్టీ పెడతానని చెప్పారు.

ఇప్పుడు పంజాబ్ ఎన్నికల గురించి అంతా చర్చ జరుగుతుంది. విజయం కోసమే ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. వారిలో కాంగ్రెస్ ముందు వరసలో ఉండగా.. బీజేపీ కూడా ఛాన్స్ వదులుకోవడం లేదు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పింది. అమరీందర్ కూడా వెనక్కి తగ్గడం లేదు. వీరే కాక.. ఆప్ నుంచి కేజ్రీవాల్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంపై ఫోకస్ చేశారు. అందుకే ఇటీవల అందరినీ కలుపుకొని వెళుతున్నారు. అందరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సో పంజాబ్ ఎన్నికల రేసు ఇలా ఉంది. వచ్చే ఏడాది జరిగే పోరులో ఎవరూ విజయం సాధిస్తారో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+