వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఉన్న వారు రైలెక్కితే కఠిన చర్యలే .. ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా !!

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తి నేపధ్యంలో రైల్వే శాఖ సంచన నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయించింది . కరోనా ప్రోటోకాల్స్ ను పాటించని ప్రయాణికులకు షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంది .మాస్కులు ధరించడం చెయ్యని , సామాజిక దూరాన్ని పాటించకుండా ప్రవర్తించే వారికి జరిమానాలు విధించనుంది రైల్వే శాఖ.

షాకింగ్ .. కరోనా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ .. రెండోసారి చాలా తీవ్రంగా వైరస్ దాడి చేస్తుందన్న రీసెర్చ్షాకింగ్ .. కరోనా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ .. రెండోసారి చాలా తీవ్రంగా వైరస్ దాడి చేస్తుందన్న రీసెర్చ్

 కరోనా ప్రోటోకాల్స్ పాటించకుంటే కఠిన చర్యలే

కరోనా ప్రోటోకాల్స్ పాటించకుంటే కఠిన చర్యలే

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ప్రయాణించడం చేస్తే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద జరిమానాలు , జైలు శిక్ష కూడా విధించేలా నిర్ణయం తీసుకుంది . మాస్కులు సరిగా ధరించకపోవటం , ప్రయాణికులు సామాజిక దూరం పాటించకుండా ప్రవర్తించటం నేరంగా పరిగణిస్తామని చెప్పింది . ఎవరికి వారు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని , మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది .

 ఆర్పీఎఫ్ కోవిడ్ రూల్స్ .. కరోనాతో ప్రయాణం చేస్తే ఫైన్, జైలు శిక్ష కూడా

ఆర్పీఎఫ్ కోవిడ్ రూల్స్ .. కరోనాతో ప్రయాణం చేస్తే ఫైన్, జైలు శిక్ష కూడా

రాబోయే పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. రైల్వే ప్రాంగణంలో ఉన్నప్పుడు, అలాగే రైళ్ళలో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణీకులు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్పీఎఫ్ . నిబంధనలు పాటించకుండా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినా రైలు ప్రయాణం చెయ్యటం చేస్తే కచ్చితంగా వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయడం కూడా చట్టవిరుద్ధం అని ఆర్‌పిఎఫ్ తెలిపింది.

కరోనా వ్యాప్తికి కారణం అయ్యే ఏ పని చేసినా శిక్ష పక్కా

కరోనా వ్యాప్తికి కారణం అయ్యే ఏ పని చేసినా శిక్ష పక్కా

అపరిశుభ్రమైన పరిస్థితులను సృష్టించే లేదా రైల్వే స్టేషన్లలో మరియు రైళ్ళలో ప్రజారోగ్యానికి భంగం కలిగేలా చెయ్యటం, కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి రైల్వే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోవటం కూడా అనుమతించని చర్యలని ఆర్పీఎఫ్ పేర్కొంది . రైల్వే చట్టం, 1989 లోని సెక్షన్ 145, 153 మరియు 154 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానాతో శిక్షించబడవచ్చునని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న తర్వాత దాని ఫలితాలు రాకముందే రైలు ఎక్కటం కూడా నేరం కిందకే వస్తుందని ఆర్పిఎఫ్ పేర్కొంది. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఏ పని చేసినా నేరం కిందకే వస్తుందని తెలిపింది.

Recommended Video

India-China Stand Off : లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది - China

English summary
Passengers not following protocols laid down for COVID-19, including wearing masks, maintaining social distancing and travelling after being diagnosed with the disease could be booked under various sections of the Railway Act, may have to pay fines and even face imprisonment, the RPF said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X