వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకసారి ఎంటరైతే తప్పించుకోలేరు: బ్లూవేల్ గేమ్‌పై సూసైడ్ నోట్

బ్లూవేల్ గేమ్ మరో ప్రాణాన్ని బలిగొంది. మధురైకి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈసారి బాధితుడు. ఈ గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆడుతున్న విగ్నేష్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

మధుర: బ్లూవేల్ గేమ్ మరో ప్రాణాన్ని బలిగొంది. మధురైకి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈసారి బాధితుడు. ఈ గేమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆడుతున్న విగ్నేష్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అంతకుముందు ఓ లేఖ రాశాడు. 'బ్లూ వేల్.. ఇదో ప్రమాదకరమైన ఆట. ఒకసారి ఎంటర్ అయితే, ఎన్నటికీ బయటకు వెళ్లలేరు' అని తనువు చాలించాడు.

Not a game, but a disaster: 19-year-old TN Blue Whale victim in suicide note

ఓ ప్రయివేటు కాలేజీలో రెండో సంవత్సరం కామర్స్ చదువుతున్న విగ్నేష్, గత కొంతకాలంగా ఎక్కువ సేపు ఫోన్ తోనే గడుపుతున్నాడని అతని స్నేహితులు పోలీసు విచారణలో వెల్లడించాడు.

తమిళనాడులో బ్లూవేల్ గేమ్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. ఇప్పటికే ముంబై, ఉత్తర ప్రదేశ్, కేరళ తదితర ప్రాంతాల్లో పలువురు మృత్యువాత పడగా, చాలా రాష్ట్రాలు ఈ గేమ్‌ను నిషేధించాయి.

రష్యాలో పుట్టిన ఈ గేమ్ ఇప్పటివరకూ సుమారు 100 మందిని పైగా బలిగొంది. టీనేజర్లు, ముఖ్యంగా చిన్నారులు ఈ గేమ్‌కు అలవాటు పడి ఆత్మహత్య ఆలోచనవైపు వెళుతున్నారు.

ఓ ప్రయివేటు చాట్ మోడ్ ఆధారిత గేమ్‌లో, చేతులు కోసుకోవడం, ఒంటరిగా ఉండటం, స్మశానాల్లో గడపడం, హారర్ సినిమాలు చూడటం వంటి 50 టాస్కులు ఉంటాయి. వీటికి సంబంధించిన సెల్ఫీలను అప్ లోడ్ చేస్తుండాలి.

భవంతి పైనుంచి దూకాలన్న టాస్క్‌లో భాగంగా పలువురు మరణిస్తున్న పరిస్థితి. ఈ గేమ్‌కు ఓ ప్రత్యేక సైట్ గానీ, యాప్ గానీ లేకపోవడంతో దీన్ని ఆడుతున్న వారి ట్రాకింగ్ క్లిష్టమైన పని అని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
In a suspected Blue Whale video game induced suicide, a 19-year-old college student hanged himself to death when he was alone at home, at Mottamalai area near Madurai on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X