• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదు రాష్ట్రాల్లో బీజేపీ భిన్న స్వరాలు- ఎక్కడి మాట అక్కడే-సీఏఏ, గోవధపైనా అదే తీరు

|

ప్రతికూల పరిస్ధితుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తోంది. అది ఎంతగా అంటే సీఏఏ, గోవధ నిషేధం వంటి తమ జాతీయ స్ధాయి అజెండాలోని కీలక అంశాలపైనా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మాట మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఫలిస్తాయో తెలియదు కానీ బీజేపీ వ్యూహాలపై ప్రత్యర్ధులు మాత్రం మాటల తూటాలు పేలుస్తున్నారు.సిద్ధాంతాలతో ఎదిగిన పార్గీగా చెప్పుకుని తిరిగే కాషాయ దళానికి ఈ విమర్శలు ఇబ్బందికరంగా తయారయ్యాయి.

ఐదు రాష్ట్రాల పోరులో బీజేపీ కుప్పిగంతులు

ఐదు రాష్ట్రాల పోరులో బీజేపీ కుప్పిగంతులు

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ రకరకాల కుప్పిగంతులు వేస్తోంది. తమ జాతీయ అజెండాలో భాగమైన పలు కీలక అంశాలపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాట వినిపిస్తోంది. తద్వారా ఓటర్లలో గందరగోళానికి తెరదీస్తోంది. ప్రత్యర్ధులు ఎంతగా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానం ఓట్లు కురిపించడం కష్టమని తాజా సర్వేలు చెప్తున్నా కాషాయ పార్టీ తీరు మారడం లేదు.

 అస్సోంలో అక్కర్లేని సీఏఏ బెంగాల్లో ప్రయోగం

అస్సోంలో అక్కర్లేని సీఏఏ బెంగాల్లో ప్రయోగం

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తొలిసారిగా అస్సోంలో అమలు చేసి చేదు ఫలితాలు చవి చూసిన బీజేపీ ఇప్పుడు తాజా ఎన్నికల్లో మాత్రం అక్కడ దాని ఊసెత్తెందుకే భయపడుతోంది. ఏకంగా అస్సాం ఎన్నికల అజెండాలో నుంచే సీఏఏను తప్పించేసింది. బీజేపీ ప్రభుత్వం సీఏఏ అమలుతో నష్టపోయిన వర్గాల ఓట్లు దూరం కాకూడదనే ఈ ఎత్తుగడ అనుసరిస్తోంది. మరోవైపు పశ్చిమబెంగాల్లో మాత్రం సీఏఏ అమలు చేస్తామని హామీ ఇస్తోంది. తద్వారా బెంగాల్లో సీఏఏ అనుకూల ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏకంగా బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అజెండా పెట్టి మరీ సీఏఏ అమలు చేసి తీరుతామని ప్రగల్భాలు పలుకుతోంది.

బీఫ్‌ బ్యాన్‌పై తమిళనాడు, కేరళలో తలోమాట

బీఫ్‌ బ్యాన్‌పై తమిళనాడు, కేరళలో తలోమాట

సీఏఏ ఒక్కటే కాదు తమ జాతీయ పార్టీ అజెండాలో ఉన్న గోవధ నిషేధంపైనా రాష్ట్రానికో విధంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు, కేరళే ఇందుకు నిదర్శనం. తమకు అధికారమిస్తే గోవధను నిషేధిస్తామని తమిళనాడులో హామీ ఇస్తున్న బీజేపీ.. కేరళలో మాత్రం గోవధ మాటెత్తేందుకే భయపడుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఖాతా తెరవాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో గోవధను నిషేధిస్తామని, పొరుగున వంటి కేరళ వంటి రాష్ట్రాలకు గోవుల రవాణాను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కానీ కేరళలో మాత్రం మాట వరసకు కూడా గోవధ గురించి మాట్లాడడం లేదు. దీనికి ప్రధాన కారణం తమిళనాడుతో పోలిస్తే కేరళలో బీఫ్‌ తినే వారి సంఖ్య రెట్టింపు ఉండటమే.

సీఏఏ దెబ్బకు అస్సోంలో మారిపోయిన సీఎం ఛాయిస్‌

సీఏఏ దెబ్బకు అస్సోంలో మారిపోయిన సీఎం ఛాయిస్‌

సీఏఏ అమలు విషయంలో అస్సోంలోని శర్భానంద్ సోనేవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కాషాయ సేన ఇరుకునపడింది. ఈసారి ఎన్నికల్లో సీఏఏ ప్రభావం లేకుండా చూసుకునేలా అసలు అజెండాలోనే ఈ అంశం చేర్చకుండా జాగ్రత్తపడింది. అంతే కాదు సీఏఏ వ్యతిరేకతను అధిగమించేందుకు శర్భానంద్‌ సోనేవాల్‌ స్ధానంలో సీనియర్ మంత్రి హిమంత బిశ్వ శర్మను సీఎం అభ్యర్ధిగా తెరపైకి తెచ్చింది. హిమంత బిశ్వ శర్మ సీఏఏ అంశాన్ని ప్రజల్లోకి సానుకూలంగా తీసుకెళ్లగలిగారని బీజేపీ పెద్దలు భావిస్తుండమే అందుకు కారణం.

English summary
The Bharatiya Janata Party (BJP), which eyes to expand its footprints from Assam and West Bengal in the eastern part to Tamil Nadu and Kerala in the south, is singing varying tunes in different states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X