వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌ మినహాయింపు కాదు: క్యాస్టింగ్ కౌచ్‌పై రేణుకా చౌదరి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సినీ రంగంలోనే కాదు మహిళలు పనిచేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు.చట్టసభల నుండి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని ఆమె విమర్శలు గుప్పించారు.

Recommended Video

సరోజ్‌ఖాన్ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఘాటు స్పందన

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇలాంటివి అన్నిచోట్లా ఉన్నాయని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. అయితే ఇది చేదు వాస్తవమని ఆమె చెప్పారు.

Not Just Film Industry, Parliament Too Facing Casting Couch: Congress Leader Renuka Chowdhury

మహిళలపై వేధింపులకు పార్లమెంట్ కూడ మినహాయింపు కాదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

హాలీవుడ్‌లో సాగుతున్న 'మీటూ' ప్రచారం తరహాలో దేశంలో కూడా బాధితులు పోరాడాలని సూచించారు. క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఆమె మంగళవారం నాడు స్పందించారు. ఈ విషయమై కొందరు చేసిన వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు.

సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా కొన్ని రంగాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Congress leader Renuka Chowdhury on Tuesday said that the casting couch culture was not just restricted to the film industry and that Parliament too was affected by it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X