వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ సరికాదన్న శరద్ పవార్, శ్రీలంక తమిళులకు ఎందుకు వద్దు అని ప్రశ్న..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. మరుసటి రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గొంతు కలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధిని కోరుకునేవారు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్, మాజీ సీఎం సిద్దూకు నో ఎంట్రీ, బెంగళూరులో !పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్, మాజీ సీఎం సిద్దూకు నో ఎంట్రీ, బెంగళూరులో !

దేశ ఐక్యతను కోరుకునేవారు సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారని శదర్ పవార్ తెలిపారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతిస్తోందని పవార్ పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకే ఎందుకు పౌరసత్వం కల్పిస్తారని ప్రశ్నించారు. శ్రీలంక తమిళులను ఎందుకు మినహాయించారని అడిగారు.

Not Just Minorities: Sharad Pawar On Citizenship act

పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రాలు కూడా సుముఖంగా లేవని శరద్ పవార్ చెప్పారు. ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉన్న బీహార్‌లో కూడా వ్యతిరేకత వచ్చినట్టు పేర్కొన్నారు. మొత్తం 8 రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని.. అందులో మహారాష్ట్ర కూడా ఉందని పేర్కొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తప్పుపట్టారు. ఇదే కాదు జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను కూడా ఆమె వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదని సోనియాగాంధీ అన్నారు.

English summary
NCP chief Sharad Pawar said that "all those who care for the country's unity and progress" are opposing the CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X