వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఫోన్ కాల్స్ కూడా కట్ అవుతున్నాయి: మనకే కాదు, ప్రధానికీ కాల్ డ్రాప్ సమస్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినప్పటికీ మనం పలుమార్లు కాల్ డ్రాప్స్‌తో ఇబ్బందిపడుతుంటాం. అప్పుడప్పుడు అయితే పదేపదే కాల్ డ్రాప్స్ అవుతుంటాయి. దీంతో మనం విసిగెత్తిపోతాం. కాల్ డ్రాప్స్ బాధ కేవలం మనకే కాదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఉందట. ఆయన ఢిల్లీ విమానాశ్రయం నుంచి తన అధికారిక నివాసానికి వెళ్తున్న సమయంలో కాల్ డ్రాప్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ పథకాలను సమీక్షించడంలో భాగంగా మోడీ ఉన్నతాధికారులతో తరుచూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈసందర్భంగా ఓ సమావేశంలో టెలికాం శాఖ కార్యదర్శి అరుణాసుందరరాజన్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధానికి వివరించారు.

 Not just you, PM Modi too faces call drops! And, he wants telcos to solve the problem fast

వీటిలో కాల్ డ్రాప్స్ కూడా ఉన్నాయని తెలిపారు. దీంతో తనకు కూడా ఈ సమస్య ఎదురైందని, తాను ఫోన్లో మాట్లాడుతుండగానే గతంలో పలుమార్లు కాల్స్ కట్ అయ్యాయని తెలిపారు.

అనంతరం ఫోన్ కాల్ అకారణంగా కట్ అయిపేతో ఆపరేటర్ల నుంచి ఎంత జరిమానాను వసూలు చేస్తున్నారని మోడీ ప్రశ్నించారు. దీంతో ప్రతి 3 కాల్ డ్రాప్స్‌కు రూ.1 జరిమానా విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాల్ డ్రాప్స్ సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని సూచించారు.

English summary
Like most of the mobile phone users in the country, Prime Minister Narendra Modi too is miffed at telecom operators for not being able to control the menace of call drops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X