వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సావర్కర్‌కి కాదు, ఆ ముగ్గురికీ ఇవ్వండి భారతరత్న: ప్రధానికి మనీష్ తివారీ లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీష్ తివారీ కోరారు. బ్రిటీష్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం జాతికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని మోడీకి రాసిన లేఖలో మనీష్ తివారీ పేర్కొన్నారు.

'బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ప్రాణత్యాగం జాతియావత్తులో జాతీయ భావాన్ని రగులుస్తూ నిరంతరం స్ఫూర్తినిస్తోంది. 1931, మార్చి 23న వారు ప్రాణత్యాగం చేశారు' అని మనీష్ తివారీ వ్యాఖ్యానించారు.

Not Savarkar, give Bharat Ratna to Bhagat Singh: Manish Tewari tells PM Modi

'2020, జనవరి 26న ఈ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులకు భారతరత్న పురస్కారం ప్రకటించినట్లయితే అధికారికంగా షాహిద్ ఈ అజమ్‌గా గౌరవించినట్లవుతుందన్నారు. మొహాలీలోని చంఢీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు షాహిద్ ఈ అజమ్ భగత్ సింగ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇది 126 కోట్ల భారతీయులను తాకింది' అని మనీష్ తివారీ అన్నారు. ఇంతకుముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ప్రకటించాలన్నారు.

మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి చెందిన వీర్ సావర్కర్, జ్యోతిబాపులేలకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తుందని ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సమాజాన్ని ఉద్ధరించిన మహానీయుల పట్ల కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు.

దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వారికి రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాగా, వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వండంటూ కేంద్రంపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ.

English summary
Congress Lok Sabha MP Manish Tewari urged Prime Minister Narendra Modi to accord India's highest civilian award Bharat Ratna to freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X