వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: నువ్వు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లా ఫీలైపోతున్నావా ?, అయితే... రా, రూ. 1,000 ఫైన్ !

|
Google Oneindia TeluguNews

ముంబై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహామ్మారిని అరికట్టడానికి ప్రభుత్వాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంత చేస్తున్నా కరోనా వైరస్ కట్టడి కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో దేశంలోని అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు తలలు పట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చేసిన సూచనలు గాలికి వదిలేసిన ప్రజలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలు పాటించకుండా బైక్ లతో పాటు ఇతర వాహనాల్లో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లా ఫీలైపోయి సంచరిస్తూ హంగామా చేస్తున్న ప్రజలపై అధికారులు కొడా ఝలిపించాలని నిర్ణయించారు. రూ. 10 మాస్క్ పెట్టుకోకపోతే వంద రెట్లు జరిమానా విధించాలని అధికారులు డిసైడ్ అయిపోయారు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 మహారాష్ట్ర నెంబర్ వన్

మహారాష్ట్ర నెంబర్ వన్

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తండావం చేస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో 1 లక్షా 65 వేల కేసులకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక తమిళనాడులో 86, 224 కేసులు, ఢిల్లీలో 83, 077 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ దెబ్బకు దేశంలో కరోనా వైరస్ కేసులు లక్షల్లో పెరిగిపోతున్నాయి.

 రెండు అక్షరాల పేర్లు చెబితే హడల్

రెండు అక్షరాల పేర్లు చెబితే హడల్

ప్రపంచంలో ముంబై, చెన్నై, ఢిల్లీ నగరాలు పేర్తు చెబితే తెలియనివాళ్లు ఎవ్వరూ ఉండరు. అలాంటి ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కావడం, దేశ ఆర్థిక రాజధాని ముంబై కావడం, ఇక చెన్నై సిటీకి అనేక ప్రత్యేకతలు ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ముంబై, చెన్నై, ఢిల్లీ పేర్లు చెబితే నేడు అమ్మో కరోనా..... ! అంటూ ప్రజలు వైరస్ భయంతో హడలిపోతున్నారు.

 ఇలా లాభం లేదు సార్

ఇలా లాభం లేదు సార్

ముంబై నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 76, 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో మాత్రమే 55, 969 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ముంబై సిటీలో కరోనా కట్టడికి బృహాన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (BMC) అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని అధికారులు మండిపడుతున్నారు. ఇక లాభం లేదని బీఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

 రూ. 10 మాస్క్ పెట్టుకోమంటే పాటుపడుతున్నారు

రూ. 10 మాస్క్ పెట్టుకోమంటే పాటుపడుతున్నారు

ముంబై సిటీలో నివాసం ఉంటున్న వారు ఇంటి నుంచి బయటకు రావాలంటే కచ్చితంగా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని BMC అధికారులు పదేపదే మనవి చేస్తున్నారు. అయితే ముఖాలకు మాస్క్ లు పెట్టుకోకుండా 50 శాతం మంది ముంబైలో విచ్చలవిడిగా సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లా ఫీలైపోయి తెగ తిరిగేస్తున్నారు. కేవలం రూ. 10 మాస్క్ పెట్టుకోవాలని అధికారులు పదేపదే మనవి చేస్తుంటే చాలా మంది మాస్క్ లు పెట్టుకోకుండా పాటుపడుతూ రోడ్ల మీద హంగామా చేస్తున్నారు.

Recommended Video

CPM Demands KCR To Increase The Tests & Save People Against COVID-19
 దూల తీరాలంటే వంద రెట్లు ఫైన్

దూల తీరాలంటే వంద రెట్లు ఫైన్

ముంబైల్ లో నేటి నుంచి ఎవరైనా ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరిగే రూ. 1, 000 అపరాద రుసుం (ఫైన్) వెయ్యాలని బీఎంసీ అధికారులు సంబంధిత వార్డు అధికారులు, ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రూ. 10 మాస్క్ పెట్టుకోకుంటే అంతకు వంద రెట్లు ఫైన్ విధించాలని, ఇలా ప్రజలకు బుద్ది చెప్పాలని బీఎంసీ అధికారులు నిర్ఱయించారు. ముంబైలో బీఎంసీ అధికారుల దెబ్బతో ఇప్పుడు ముఖానికి మాస్క్ లు పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తారో ? లేక రూ. 1, 000 అపరాధ రుసుం చెల్లించి దూల తీర్చుకుంటారో మీ ఇష్టం అని పోలీసులు అధికారులు, BMC వార్డు అధికారులు ప్రజలకే లాస్ట్ చాన్స్ ఇచ్చారు.

 అంతా మీఇష్టం.... తేల్చుకోండి

అంతా మీఇష్టం.... తేల్చుకోండి

ముఖాలకు ఎవరైనా మాస్క్ లు వేసుకోకుండా బయటకు వచ్చి రోడ్ల మీద కనపడితే అక్కడే (స్పాట్ లో) రూ. 1, 000 అపరాద రుసుం చెల్లించాలని పోలీసు అధికారులు, BMC వార్డు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 1, 000 చొప్పున అపరాద రుసుం వసూలు చేస్తున్నారు. ముఖానికి మాస్క్ లేకపోతే భారీ మొత్తంలో అపరాద రుసుం చెల్లించాలని పోలీసులు హెచ్చరించడంతో ప్రజలు ఇప్పుడు ముఖానికి మాస్క్ లు వేసుకుని బయటకు వస్తారో ? లేక వారి అందమైన ముఖాలను చూపించి జోబులు ఖాళీ చేసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు ముంబై సిటీ పోలీసులు, BMC వార్డు అధికారులు.

English summary
Coronavirus: In a order Brihanmumbai Municipal Corporation (BMC) said that people who not wearing mask will be fined 1,000. Police and ward officials to impose the fine on spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X