వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి శ్రీనివాసన్ ఝలక్: నోట్ల రద్దుతో ఉపయోగంలేదు!

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రముఖ ఆర్థిక వైత్త శ్రీనివాసన్ స్పందించారు. నల్లధన నిర్మూలనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రముఖ ఆర్థిక వైత్త శ్రీనివాసన్ స్పందించారు. నల్లధన నిర్మూలనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదన్నారు.

అవినీతి అంతానికి ప్రభుత్వం స్పష్టమైన ఆలోచన విధానంతో రావాలన్నారు. అవినీతి నిరోధానికి దానిపై పోరు సాగించడానికి కచ్చితమైన చర్యలంటూ ఏమీ లేవన్నారు.

note ban

పెద్ద నోట్ల రద్దుతో భారత్‌లో అవినీతిని కూకటివేళ్లతో పెకలించి, పారదర్శకత పెంచడం జరగకపోవచ్చునని చెప్పారు. భారత్‌లో అది అనుకోకుండా జరిగిపోయిందన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ముందుగా చెప్పలేదన్నారు.

ప్రభుత్వానికి తగిన సంసిద్ధత, స్పష్టమైన ఆలోచన లేదని అర్థమవుతోందన్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సంకల్పించినప్పుడు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకుసాగాలన్నారు. పెద్దనోట్ల రద్దు గురించి కేంద్ర గణాంకశాఖ, ఆర్థిక వ్యవహారాలశాఖలకు ప్రభుత్వం సరైన లక్ష్యాలను నిర్దేశించలేకపోయిందన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలు బీజేపీకి, ప్రధాని మోడీకి షాక్ అని చెప్పవచ్చు.

English summary
Noted US-based economist TN Srinivasan has cast serious doubts on the efficacy of the cash ban move, saying it will not help in fighting the menace of blackmoney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X