వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గనున్న కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ, కరెన్సీ కష్టాలు తప్పవా

12 గంటల నుండి తొమ్మిది గంటలే పనిచేయాలని బెంగాల్ లో కరెన్సీని ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ కార్మికులు, ఉద్యోగులు నిర్ణయం తీసుకొన్నారు.అయితే ఈ నిర్ణయం కారణంగా కరెన్సీ నోట్ల ముద్రణ పడిపోనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా :కొత్త కరెన్సీ ప్రింటింగ్ పడిపోనుంది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా కొత్త కరెన్సీ కోసం రిజర్వ్ బ్యాంకుకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ లలో 12 గంటల పాటు ఉద్యోగులు పనిచేస్తున్నారు.అయితే బెంగాల్ లోని ప్రింటింగ్ ప్రెస్ కార్మికులు 9 గంటల పాటే పనిచేస్తామని తేగేసి చెప్పారు. దీంతో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ 60 లక్షలకు పడిపోనుంది.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకుగాను సుమారు 12 గంటలపాటు ప్రింటింగ్ ప్రెస్ లలో ముద్రణను చేయిస్తున్నారు. అయితే 12 గంటలపాటు నిరాటంకంగా కరెన్సీని ముద్రిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నార. కనీసం మధ్యాహ్న, భోజన విరామ సమయాలు కూడ సక్రమంగా తీసుకోకుండా పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

బెంగాల్ లోని ముద్రణ సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు 9 గంటలపాటే పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని వారు యాజమాన్యానికి తెలిపారు. ఈ ప్రెస్ లో ప్రతి రోజూ 12 గంటలపాటు కరెన్సీని ముద్రిస్తే ప్రతి రోజు సుమారు 4.6లక్షల కరెన్సీని ప్రింట్ చేస్తారు.

note printing likely to drop by 6 million as workers at salboni press refuse to work overtime

అయితే ఇక్కడ 9 గంటలపాటే కరెన్సీని ప్రింట్ ను చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 60 లక్షలకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా కనీసం 12 గంటల పాటు పనిచేయాలని ప్రింటింట్ ప్రెస్ లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యాలు ఆదేశాలు ఇచ్చాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివకు 12 గంటలపాటు పనిచేసేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులు మాత్రం ఇక నుండి 9 గంటలపాటే విధులను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

English summary
printing press employees of west bengal's salboni currency printing press have decidede to not work beyond nine hours shift citing health issues,move that is likely to impact the printing of currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X