బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

Recommended Video

Legendary Actor Girish Karnad Passed Away In His Bengaluru Residence || Filmibeat Telugu

ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘనాథ్ కర్నాడ్. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరన్‌లో ఆయన జన్మించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

నాటకాలతో గుర్తింపు

నాటకాలతో గుర్తింపు

కన్నడలో రాసిన పలు నాటకాలు గిరీష్ కర్నాడ్‌కు గుర్తింపు తెచ్చాయి. 1970లో సంస్కారా చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రం చేశారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన ధర్మచక్రం సినిమా ద్వారా గిరీష్ కర్నాడ్ టావీలుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్ తదితర చిత్రాల్లో నటించారు. వెండి తెరపైనే కాదు.. బుల్లి తెరపైనా ఆయన తన మార్కు చూపించారు. పిల్లలు పెద్దల్ని అమితంగా అలరించిన మాల్గుడి డేస్ సీరియల్‌లో ఆయన నటించారు. ఆయన నటించిన చివరి సినిమా అప్నా దేశ్. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 26న విడుదల కానుంది.

పలు అవార్డులు సొంతం చేసుకున్న కర్నాడ్

పలు అవార్డులు సొంతం చేసుకున్న కర్నాడ్

మద్రాస్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పనిచేస్తున్న సమయంలో డా. సరస్వతి గణపతితో గిరీష్ కర్నాడ్‌కు పరిచయమైంది. దాదాపు పదేళ్ల తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. సాహిత్యంలో మంచి పట్టున్న గిరీష్ కర్నాడ్‌కు 1998లో సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ్ అవార్డ్ ప్రదానం చేసింది. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు ఇచ్చింది. సినిమాలకు సంబంధించి ఆయన ఏడు ఫిలింఫేర్, 10 నేషనల్ అవార్డులు అందుకున్నారు.

ప్రముఖుల సంతాపం

ప్రముఖుల సంతాపం

గిరీష్ కర్నాడ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ, సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు. గిరీష్ కర్నాడ్ మరణ వార్త కలిచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ట్వీట్ చేశారు.

English summary
Veteran playwright and actor Girish Karnad passed away on Monday at the age of 81 after a prolonged illness in Bengaluru.The actor breathed his last due to multiple organ failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X