వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సచిన్ Vs లతా' పేరడీ వీడియోపై మంగేష్కర్ ఏమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 'సచిన్‌ వర్సెస్‌ లత సివిల్‌ వార్‌' పేరుతో ఏఐబీ ఛానెల్ సహవ్యవస్థాపకుడు తన్మయ్ భట్ రూపొందించిన వీడియోపై ఎట్టకేలకు బాలీవుడ్ లెజెండ్రీ సింగర్, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ ఎట్టకేలకు పెదవి విప్పారు. యావత్ భారతదేశం ఆరాధించే సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్‌ల ముఖాలతో మే 26న తన్మయ్ భట్ ఫేస్‌బుక్‌లో ఉంచిన పేరడీ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శల దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో లతా మంగేష్కర్ ఈ దీనిపై తానెలాంటి మనస్తాపం చెందలేదని ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. 'నా తరఫున ఎవరూ సమస్యలు తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా శ్రేయాభిలాషులందరికీ ఒకటి చెప్పదలచుకున్నాను. హ్యూమరస్ ఇమిటేషన్స్ వంటివి నా దృష్టిలో చాలా చిన్న విషయాలు. జీవితంలో వీటికంటే ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. కొందరు వ్యక్తులు దుష్ప్రచారాలకు ఒడిగడుతుంటారు. అటువంటి వారికి అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వకూడదు. వాళ్లు అలా చేయడానికి వారి కారణాలు వారికి ఉంటాయి' అని తన్మయ్ భట్ సెటైర్స్‌ను తేలిగ్గా కొట్టిపారేశారు.

<strong>అసభ్య హాస్యం: సచిన్-లతామంగేష్కర్ వీడియో రగడ</strong>అసభ్య హాస్యం: సచిన్-లతామంగేష్కర్ వీడియో రగడ

Nothing affects me: Lata Mangeshkar on the Tanmay Bhat debacle

అసలు ఇంతవరకు ఆ వివాదాస్పద వీడియోను ఆమె చూడలేదని పేర్కొన్నారు. లతా మంగేష్కర్, సచిన్‌లను అనుకరిస్తూ తన్మయ్ భట్ చేసిన ఎగతాళిపూరిత సంభాషణ వీడియోపై బీజేపీ, శివసేనతో పాటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగేష్కర్‌, సచిన్‌ల గౌరవానికి వీడియో భంగం కలిగిస్తోందని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

ఈ వీడియోపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల సైతం మండిపడ్డారు. పాతతరం రచయితలైన సలీం ఖాన్, జావేద్ అక్తర్‌లు తన్మయ్ భట్‌ను తప్పుబట్టారు. తన్మయ్‌భట్‌ను సెన్సార్‌బోర్డు సభ్యుడు అశోక్‌పండిట్, ప్రముఖ గాయకుడు సోనూనిగమ్, బాలీవుడ్ నటులు అనుపమ్‌ఖేర్, రితేశ్‌దేశ్‌ముఖ్, సెలీనా జైట్లీ తదితరులు కూడా తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

English summary
The barrage of angry responses to the Tanmay Bhat’s SnapChat video on Lata Mangeshkar and Sachin Tendulkar has left her unaffected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X