• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉన్న‌ది లేన‌ట్టు..! లేనిది ఉన్న‌ట్టు..! అమెరికా ఫేక్ యూనివ‌ర్సిటీ ప‌చ్చి మోసాలు..!!

|

డెట్రాయిట్/హైద‌రాబాద్ : నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. 600మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8మంది తెలుగువారిని అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి నకిలీయూనివర్సిటీ- యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఏర్పాటు చేసిన హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

 వ‌ల‌స‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా చీప్ ట్రిక్స్..! అంధ‌కారంలో విద్యార్థుల భ‌విత‌..!!

వ‌ల‌స‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా చీప్ ట్రిక్స్..! అంధ‌కారంలో విద్యార్థుల భ‌విత‌..!!

లేని యూనివర్సిటీని ఉన్నట్లు చూపారు... లేని తరగతులను ఉన్నట్లుగా భ్రమ కల్పించారు.. గొప్ప ప్రొఫెసర్లకు వేదికగా నమ్మబలికారు.. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన వర్సిటీగా కలరింగ్‌ ఇచ్చారు.. అమెరికాలో ఇన్ని ప్రత్యేకతలున్న యూనివర్సిటీ అయినా.. తమ పని చేసుకుంటూనే చదువుకోవచ్చని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.. అంతే వందలమంది భారతీయ విద్యార్థులు చేరిపోయారు.. చివరకు వాళ్లు జైలుపాలయ్యారు.. ఇన్ని చేసి ఒక నకిలీ వర్సిటీని ఏర్పాటు చేసింది ఎవరో.. వాళ్లని అసలు వదల కూడదు అనకునేరు.. ఆ ఫేక్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందే అమెరికా అంతర్గత భద్రతా ఏజన్సీలు.. అంటే ప్రభుత్వమే కావాలని వలస చట్టాలను ఉల్లంఘింస్తూ, ఎంఎస్‌ల మీద ఎంఎస్‌లు చదివే వారిని పట్టుకునేందుకు ఒక ఎర వేశారు.

 అమెరికా అదికారుల ప‌చ్చి మోసం..! ఏజెంట్ల‌తో కుమ్ముక్కు..!!

అమెరికా అదికారుల ప‌చ్చి మోసం..! ఏజెంట్ల‌తో కుమ్ముక్కు..!!

విద్యార్థులను వర్సిటీలకు తెచ్చే ఏజెంట్లకు ఈ వ్యూహం తెలియక ఏకంగా అంతర్గత భద్రతా ఏజన్సీలతో ఒప్పందం చేసుకున్నారు. విద్యార్థులను చేర్పించేందుకు వారి దగ్గరే డబ్బులు తీసుకున్నారు. ఆ మధ్యవర్తులు కూడా ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం. అప్పటికే ఒక ఎంఎస్‌ పూర్తి అయి, ఓపీటీ లోపలే జాబ్‌ రాక, దేశంలో కొనసాగాలంచే కచ్చితంగా ఏదోఒకటి వర్సిటీలో చదివితే మరింత సమయం దొరుకుతుంది అనే తపనతో చాలా మంది విద్యార్థులు.. మధ్యవర్తుల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ఫేక్‌ వర్సిటీలో అడ్మిషన్‌ పొందారు. ఈ ప్రక్రియలో భాగంగా మధ్యవర్తులు ఇటు విద్యార్థుల నుంచి అటు అమెరికా అంతర్గత భద్రతా ఏజెన్సీల నుంచి డబ్బులు భారీగానే గుంజిన‌ట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో త‌ల్లిదండ్రుల టెన్ష‌న్..! విద్యార్థులు అమెరికా వీడ‌ట‌మే శ్రేయ‌స్క‌రం..!!

తెలుగు రాష్ట్రాల్లో త‌ల్లిదండ్రుల టెన్ష‌న్..! విద్యార్థులు అమెరికా వీడ‌ట‌మే శ్రేయ‌స్క‌రం..!!

అయితే దీంట్లో బలైన వారిలో ఎక్కువ మంది తెలగువిద్యార్థులు ఉండటంతో ఏపీ, తెలంగాణలోని వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దేశంకాని దేశంలో వారి పరిస్థితి చూసి అమెరికాలో ఉండే తెలుగువారు సైతం చలించిపోతున్నారు. కొరివితో తల గోక్కున విధంగా ఏకంగా అమెరికా భద్రతా ఏజన్సీలతోనే పెట్టుకోవడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భద్రతా అధికారులు సృష్టించిన ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీలో చేరిన చాలా మంది విద్యార్థులు, వారిని చేర్పించిన మధ్యవర్తులు జైలుపాలయ్యారు. బుధవారం ఏకకాలంలో ఇలాచేరిన వారందరిని వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అరెస్టు అయిన వారిలో ఫ్లోరెడాలో ఉంటున్న భరత్‌ కాకిరెడ్డి, అట్లాంటాలోని అశ్వనాథ్‌ నూనె, వర్జీనియాలో ఉండే సురేష్‌రెడ్డి కందల, లూయిస్విల్‌లో ఉండే ఫనిదీప్‌ కర్నాటి, ఉత్తర కరోలినాలోని ప్రేమ్‌ కుమార్‌ రామ్పీసా, కాలిఫోర్నియాలోని సంతోష్‌రెడ్డి శామా, పెన్సిల్వేనియా లోని అవినాష్‌ తక్కలపల్లి, డల్లాస్‌ లోని నవీన్‌ ప్రతాపతి ఉన్నట్లు సమాచారం.

 హూం లాండ్ సెక్యూరిటీ అదికారుల మోసం..! అమెరికా ప్ర‌భుత్వ స‌హ‌కారం..!!

హూం లాండ్ సెక్యూరిటీ అదికారుల మోసం..! అమెరికా ప్ర‌భుత్వ స‌హ‌కారం..!!

విద్యార్థులకు కావాల్సింది ఏదో ఒక వర్సిటీలో అడ్మిషన్‌.. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని కొందరు మధ్యవర్తులు వారి జీవితాన్ని కటకటాలపాటు చేశారు. నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణం చూపుతూ డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. 600 మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8మంది తెలుగువారిని అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి నకిలీయూనివర్సిటీ- యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఏర్పాటు చేసిన హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్ ఆపరేషన్ ఫలితంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక్కడ వందలాది మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉన్నారని అమెరికా అధికారులు గుర్తించారు. వీసా కాలపరిమితి ముగిసినా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారిని అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఇందులో తెలుగువారు అధికంగా ఉన్నారు.

English summary
Detroit police detained more than 200 Telugu students ​​have fake master degrees in the US. 8 Telugu ​​were arrested for cooperating with fake documents for 600 foreign students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X