వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ..పీడీపీతో కలవలేదా: శివసేన..కాంగ్రెస్ తో కలిస్తే తప్పా: సంజయ్ రౌత్..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకోవాలనే ఆశయంతో శివసేన గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పటంతో.. గవర్నర్ శివసేనకు 24 గంటల సమయం ఇచ్చారు. ఈ సాయంత్రంలోగా శివసేన గవర్నర్ కు సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో శివసేన అటు కాంగ్రెస్..ఇటు ఎన్సీపీతోనూ చర్చలు చేస్తోంది. అందులో తొలి వారి డిమాండ్ మేరకు శివసేన ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చింది.

 మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలు మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలు

ఇక, శివసేనకు మద్దతు ఇచ్చే అంశం పైన అటు కాంగ్రెస్..ఇటు ఎన్సీపీ పార్టీ నేతలతో సమీక్షిస్తోంది. ఇక, సిద్దాంతాలకు వ్యతిరేకమైన పార్టీలు అధికారం కోసం ఒక్క టవుతున్నారనే విమర్శల పైన శివసేన ఎంపి సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ లో పీడీపీతో బీజేపీ అధికారం పంచుకోగా లేనిది..తాము కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సాయంత్రం లోగా మద్దతు పైన ఆ రెండు పార్టీల నుండి స్పష్టత రాకపోతే..మరింత సమయం గవర్నర్ ను కోరాలని శివసేన భావిస్తోంది.

బీజేపీ..పీడీతో కలవలేదా..

బీజేపీ..పీడీతో కలవలేదా..

సిద్ధాంత వైరుధ్యమున్న పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ వస్తున్న ప్రశ్నలపై శివసేన పార్టీ స్పందించింది. జమ్మూ కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోగా లేనిది... తాము కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా 29 స్థానాల్లో ఇతరపార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతు సాధించేందుకు శివసేన ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వారి డిమాండ్ మేరకు తమ పార్టీ నుండి ఎన్డీఏలో మంత్రిని ఉపసంహరించుకొని..ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది.

 కాంగ్రెస్..ఎన్సీపీలో తర్జన భర్జన..

కాంగ్రెస్..ఎన్సీపీలో తర్జన భర్జన..

ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల చొప్పున చెరిసగం పంచుకుందామంటూ శివసేన డిమాండ్ చేయడం... అంతుకు బీజేపీ ససేమిరా అనడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. శివసేన ఎంతకీ దిగిరాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ శనివారం గవర్నర్ ఆహ్వానించినప్పటికీ బీజేపీ అంగీకరించలేదు. ప్రతిపక్షంలో కూర్చునేందుకే ఆ పార్టీ మొగ్గుచూపడంతో.. రెండవ అతి పెద్ద పార్టీ శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కోష్యారీ ఆహ్వానం పంపారు. దీంతో..తమను మద్దతు కోరిన శివసేనును సమర్ధించాలా లేదా.. అనే విషయం పైన కాంగ్రెస్..ఎన్సీపీ విడివిడిగా తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అటు ఢిల్లీలో కాంగ్రెస్..ఇటు ముంబాయిలో ఎన్సీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ తరువాత శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రితో చర్చల తరువాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

శరద్ పవార్ నిర్ణయమే కీలకంగా..

శరద్ పవార్ నిర్ణయమే కీలకంగా..

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ఎన్సీపీ మధ్య మైత్రి కొనసాగుతోంది. మహారాష్ల్ర లో శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి కొనసాగేందుకు ఎన్సీపీ దాదాపు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. శివసేర్న.. ఎన్సీపీ కలిస్తే 110 సీట్లు ఉన్నాయి. మరో 35 మంది మద్దతు అవసరం కానుంది. కాంగ్రెస్ నుండి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నేరుగా ప్రభుత్వంలో చేరకున్నా..ఎన్సీపీ కోసం బయట నుండి మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే, ముందుగా శరద్ పవార్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన సూచనల మేరకే సోనియా నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

భవిష్యత్ రాజకీయాల పైన ఫోకస్..

భవిష్యత్ రాజకీయాల పైన ఫోకస్..

రెండు ప్రాంతీయ పార్టీలుగా..మరాఠా పార్టీలుగా ఉన్న శివసేన..ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయించి..కాంగ్రెస్ మద్దతు శరద్ పవార్ కోరితే అందుకు కాంగ్రెస్ సైతం సిద్దంగా ఉంది. అదే సమయంలో ఎన్సీపీ నుండి శివసేనకు అందిన ప్రతిపాదనల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చినా..ఎన్సీపీ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం. అదే సమయం లో కాంగ్రెస్ సైతం ప్రభుత్వంలో చేరితే స్పీకర్ పదవి ఇస్తూ..మూడు పార్టీల కామన్ మినిమమ్ అజెండాతో ప్రభుత్వం నడిపించే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల సమావేశాలు ముగిసిన తరువాత మొత్తం వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
Shivasena saying no wrong in allie with congress. Mp Sanjay rowth asking how BJP gorm govt along with PDP in kashmir. Congress and NCP chiefs on meetigs with party leaders on supporting to shivasena to form govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X