వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్క మారింది... దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? దేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? స్కూల్‌లో పిల్లలను కామన్‌గా అడిగే ప్రశ్న ఇది. ఇప్పటి వరకు పిల్లలు దానికి చెప్పిన జవాబు 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ ఇప్పుడా లెక్క మారింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దీంతో రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల సంఖ్య కాస్తా మారిపోయింది.

ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రం జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ను వేరు చేసింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్ శాసనసభ లేని యూనియన్ టెరిటరీగా మారాయి. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదా కోల్పోవడంతో ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంతో ఇకపై దేశంలో యూనియన్ టెరిటరీల సంఖ్య 9కి పెరిగింది. ఆర్టికల్ 370 రద్దుకు అనుమతిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో ఇకపై జమ్మూ కాశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.

Now 28 states, 9UTs in India

కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రాష్ట్రాల తరహాలో ఇక్కడ అసెంబ్లీలు ఉండవు. అయితే గతంలో ఉన్న ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్ఛేరిల్లో అసెంబ్లీలు ఉన్నాయి. దీంతో ఆయా యూనియన్ టెరిటరీల్లో అధికారులు కేంద్రం, స్థానిక ప్రభుత్వం మధ్య విభజింపబడి ఉంటాయి. అయితే నిర్ణయాల్లో మాత్రం కేంద్రానిదే పై చేయిగా ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీల్లో చంఢీఘడ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ సరసన లడాఖ్, శాసనసభ కలిగిన దేశ రాజధాని ఢిల్లీ, పుదిచ్చేరి సరసన జమ్మూ కాశ్మీర్ చేరింది.
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన ఆంశాలను వెంటవెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రస్తావించారు. దీనిపై విపక్షాల అభ్యంతరాల మధ్యే చర్చ కొనసాగింది. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూ కాశ్మీర్‌లో ఇకపై రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

English summary
Scrap Article 370 of the Constitution which gives special status to Jammu and Kashmir and said the state will be split into two Union Territories Jammu and Kashmir with an Assembly and Ladakh without one. With this reform, India now has 28 states and 9 union territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X