వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫీగా సంసారం!: ‘ఆదర్శ కోడలు’ కోర్సు ప్రవేశపెట్టనున్న భోపాల్ వర్సిటీ, ఏం నేర్పిస్తారంటే?

|
Google Oneindia TeluguNews

భోపాల్: తమ ఇంట్లోకి సంస్కారవంతమైన కోడలు రావాలని ఏ అత్తామామలు కోరుకురు చెప్పండి. ఇలాంటి వారి కోసమేనేమో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బర్కాతుల్లా యూనివర్సిటీ 'ఆదర్శ్ బాహూ(ఆదర్శవంతమైన కోడలు)' అనే కోర్సును కూడా తాజాగా ప్రవేశపెట్టబోతోంది. ఈ కోర్సు కొంత వింతగా అనిపిస్తున్న డిమాండ్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు.

<strong>అందంతోపాటు ఆరోగ్యం: కాళ్ళకు పారాణి ఎందుకంటే?</strong>అందంతోపాటు ఆరోగ్యం: కాళ్ళకు పారాణి ఎందుకంటే?

ఏం నేర్పిస్తారంటే..

ఏం నేర్పిస్తారంటే..

ఈ కోర్సులో ఇంతకూ ఏమి నేర్పిస్తారంటే.. పెళ్లయ్యాక భర్త పట్ల, అత్తామామల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి?, ఎలా నడుచుకోవాలి?.. లాంటి విషయాలు నేర్పిస్తారట. కాగా, మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది.

పెళ్లయ్యాక కొత్త జీవితం సాఫీగా..

పెళ్లయ్యాక కొత్త జీవితం సాఫీగా..

2019 నుంచి ఈ ఆదర్శ్ బాహు కోర్సును ప్రారంభించనున్నట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. మూడు నెలలపాటు శిక్షణా తరగతులు ఉంటాయని వెల్లడించింది. పెళ్లయ్యాక కొత్త జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఈ కోర్సు సహాయపడుతుందని పేర్కొంది.

కలహాలు లేకుండా..

కలహాలు లేకుండా..

‘వివాహమైన తర్వాత అమ్మాయి జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. ఆ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులకు ఆడపిల్లలు త్వరగా అలవాటు పడలేరు. అందుకోసమే ఈ కోర్సును ప్రవేశపెట్టాం. మా వర్సిటీకి సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది. కేవలం చదువు విషయంలోనే కాదు ఆడ పిల్లల కోసం ఇలాంటి కోర్సులు పెడితే కాపురాల్లో ఎలాంటి కలహాలు చోటు చేసుకోకుండా ఉంటాయన్నది తమ అభిప్రాయం' అని బర్కతుల్లా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డీసీ గుప్తా పేర్కొన్నారు.

అదే ఆశయంతో.. నెటిజన్ల సెటైర్లు..

అదే ఆశయంతో.. నెటిజన్ల సెటైర్లు..

ఈ కోర్సు పూర్తయ్యాక అమ్మాయిలు మరింత ఉన్నత స్థానంలో ఉండాలన్నది తమ ఆశయమని గుప్తా వివరించారు. తొలి విడతలో 30మంది విద్యార్థినులను చేర్చుకోబోతున్నట్లు తెలిపారు. అయితే, వర్సిటీ ఈ కోర్సును ప్రవేశపెట్టడంపై కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అబ్బాయిల కోసం కూడా ఆదర్శవంతమైన అల్లుడు అనే కోర్సు కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

English summary
The university that can’t decide if BCA students can write their exams in Hindi and English has decided to launch a short-term course to “prepare” an Adarsh Bahu and truly believes it is a step ahead in women empowerment. The three-month course will be launched from the next academic session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X