వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిపిక కేసులో కీలకం: కుక్క కోసం పోలీసు గాలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్ కోసం గాలిస్తున్నారు. భార్య లిపిక మిత్రా తన భర్త సోమనాథ్ భారతిపై దాఖలు చేసిన గృహ హింస కేసులో కుక్క కీలకంగా మారింది.

ఆ కుక్కను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కూడా కోరారు. అయితే, ఆ కుక్క కనిపించకుండా పోయింది. దాంతో దాని కోసం పోలీసులు గాలింపు చర్యాలు చేపట్టారు. సోమనాథ్ భారతీ ఆదేశాలతో తాను గర్భంతో ఉన్నప్పుడు ఆ కుక్క తనను కరిచిందని లిపికా మిత్రా ఆరోపించారు. దీంతో అది కేసులో కీలకంగా మారింది.

somanth bharti

సోమనాథ్ భారతి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కేసులో డాన్ కీలకమని, అది సోమనాథ్ భారతి ఆదేశాల మేరకు లిపికను కరిచిందనే ఆరోపణ ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు చెప్పారు. ఫిర్యాదు దాఖలైప్పటి నుంచి అది కనిపించకుండా పోయిందని, దర్యాప్తునకు అది అత్యంత కీలకమని, దాని కోసం సోమనాథ్ భారతి కార్యాలయాల్లోనూ ఇంట్లోనూ సోదాలు నిర్వహించామని పోలీసులు చెప్పారు.

అది ఎక్కడ ఉందో సోమనాథ్ భారతికి తెలుసునని పోలీసులు అంటున్నారు. రెండు సందర్భాల్లో సోమనాథ్ భారతి చంపడానికి ప్రయత్నించాడని లిపిక ఆరోపించారు. కుక్కను పోలీసులు ఎలా విచారిస్తారని, దాని వాంగ్మూలం ఎలా తీసుకుంటారని సోమనాథ్ భారతి సోమనాథ్ భారతి తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ అన్నారు.

కుక్కను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. సోమనాథ్ భారతి బెయిల్ పిటిషన్‌ను సోమవారంనాడు కోర్టు తిరస్కరించింది.

English summary
Former law minister of Delhi Somnath Bharti’s life may have gone to the dogs over his marital troubles but it’s his dog that the police seek now. On Monday, as a Delhi court issued a non-bailable warrant for the AAP MLA in a domestic violence case, the Delhi Police asked for custody of Bharti’s pet dog that allegedly attacked his wife Lipika Mitra on his instructions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X