వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల తీర్పుతో ఎవరు అనర్హులు, ఎవరు బకరాలు, మంత్రి బళ్లారి, మాజీ సీఎంలు ఎక్కడ ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉత్కంఠకు గురి చేసిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వచ్చిన సమయంలో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ఎవరు అనర్హులు ? మీరా ? మేమా ? అంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చిన సమయంలోనే ఇప్పుడు ఎవరు బకరాలు ? అయ్యారు అంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును కచ్చితంగా గౌరవించాలని, అది ఎవరైనా సరే అంటూ బీజేపీ మంత్రి బళ్లారి శ్రీరాములు ఓ ట్వీట్ చేశారు.

దేవుడా, ఉప ఎన్నికల ఫలితాలకు ముందే సీఎంకు ట్రబుల్ షూటర్ అడ్వాన్స్ విషెస్, కాంగ్రెస్ కు షాక్ !దేవుడా, ఉప ఎన్నికల ఫలితాలకు ముందే సీఎంకు ట్రబుల్ షూటర్ అడ్వాన్స్ విషెస్, కాంగ్రెస్ కు షాక్ !

ప్రజలే దేవుళ్లు

ప్రజలే దేవుళ్లు

అనర్హులు ఎవరు ? అనే విషయం ఉప ఎన్నికల్లో ప్రజలు, ఓటర్లు నిర్ణయించారని మంత్రి శ్రీరాములు అన్నారు. మా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు అనర్హులు, పనికిరాని వాళ్లు అంటూ కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారని,

బీజేపీ అభ్యర్థుల మీద, మా మీద లేనిపోని ఆరోపణలు చేసి లాభం పొందాలని ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు ఏమైయ్యిందని ఆ రెండు పార్టీల నాయకులను మంత్రి బళ్లారి శ్రీరాములు ప్రశ్నించారు.

ఛీకొట్టిన ఓటర్లు

ఛీకొట్టిన ఓటర్లు

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికారంలోకి రావడానికి అనర్హులు అంటూ ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టారని, ఇప్పటికైనా మీకు బుద్ది వస్తే చాల మంచిదని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంతో ఆ రెండు పార్టీల నాయకులకే మేలు జరిగిందని, మాకు ఎలాంటి న్యాయం జరగలేదని ప్రజలు అంటున్నారని మంత్రి బళ్లారి శ్రీరాములు చెప్పారు.

మేం సేఫ్ మిత్రమా

మేం సేఫ్ మిత్రమా

మేము ఊహించినదానికంటే ఓటర్ల మమ్మల్ని ఎక్కువగా ఆదరించి మీరే అధికారంలో ఉండాలని తీర్పు ఇచ్చారని, ఈ సందర్బంగా ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నామని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు ఎలాంటి ఢోకాలేదని, ఆయన పూర్తి కాలం అధికారంలో ఉంటారని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

మీరు ఎక్కడున్నారు స్వామి !

మీరు ఎక్కడున్నారు స్వామి !

15 శాసన సభ నియోజక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని ఆధరించారని, కొన్ని నియోజక వర్గాల్లో మా పార్టీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలినా మొత్తం మీద తమకే అనుకూలంగా ఓటర్లు మద్దతు ఇచ్చారని, జీవితాంతం వారికి రుణపడి ఉంటామని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మీరు ఎక్కడున్నారు దేవుడా అంటూ మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్.డీ. కుమారస్వామిలను ప్రజలు అడుగుతున్నారని, కనీసం ఆ పార్టీ నాయకులైనా ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

English summary
Bengaluru: Voters verdict is out, now Disqualified MLAs fate decided said minister B Sriramulu after the Karnataka by elections results 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X