వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఐబీఎంలో 5 వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్దం

రోజుకో ఐటీ కంపెనీ తమ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రయత్నాలను చేస్తోంది. సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొంటున్న మార్పుల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుడుతున్నాయి క

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోజుకో ఐటీ కంపెనీ తమ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రయత్నాలను చేస్తోంది. సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొంటున్న మార్పుల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుడుతున్నాయి కంపెనీలు. తాజాగా ఐబీఎం 5 వేల ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది.

ఐటీ కంపెనీల బాటలోనే ఇంటర్నేషనల్ బిజినెస్ మెసీన్స్ కార్పోరేషన్ (ఐబీఏం) కూడ అడుగులు వేస్తోంది. వచ్చే కొన్ని నెలల్లో ఏకంగా 5 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోందని సమాచారం.

ఇప్పటికే ఇన్పోసిస్ , విప్రో, కాగ్నిజెంట్ లు ఇదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఐబీఎం కూడ ఇదే బాటలో నడుస్తుండడం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగించే గుర్తించమని మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయని ఐబీఎం ఉద్యోగి ఒకరు చెప్పారు.ఉద్యోగుల తీసివేతల విషయంలో పూర్తిస్పష్టత వచ్చిన తర్వాత కానీ, ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టకూడదని ఓ అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

అయితే సంస్థ నుండి ఎంతమందిని తొలగిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎటువంటి ఉద్యోగులను తొలగించనున్నారనే విషయమై కూడ ఐబిఎం నుండి స్పష్టత రాలేదు. ప్రస్తుతం భారత్ లో 1.50 లక్షల మంది ఉద్యోగులున్నారు.

English summary
IBM may let go of at least 5,000 employees over the next few quarters, people familiar with the development. making it the latest round job cuts that has plagued the IT sector in the last few weeks. IBM's job cuts come close on the heels of similar moves at Infosys Wipro and Cognizant, in what is a turning out to be a difficult year for the IT sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X