వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను జైల్లో పెట్టుకోండి: సుప్రీం కోర్టుకు జస్టిస్ కర్ణన్ సవాల్

తనను తిరిగి విధుల్లోకి పంపించాలని లేదంటే మరోసారి తాను కోర్టుకు హాజరుకానని కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనను తిరిగి విధుల్లోకి పంపించాలని లేదంటే మరోసారి తాను కోర్టుకు హాజరుకానని కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కార కేసులో ఆయనను విధుల నుంచి దూరంగా ఉంచిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నేడు విచారణకు హాజరైన కర్ణన్‌.. కావాలంటే జైలుకు పంపండని సుప్రీం కోర్టుకు సవాల్ విసిరారు. అంతేకాదు, తాను సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.

తాను ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తానని చెప్పారు. అయితే, ఏం ఆర్డర్ ఇస్తాననే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.

<strong>సుప్రీం అరెస్ట్ వారెంట్: పనివాళ్లం కాదు.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు </strong>సుప్రీం అరెస్ట్ వారెంట్: పనివాళ్లం కాదు.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

Now Justice Karnan to pass order against Supreme Court

కాగా, దేశంలో చాలామంది అవినీతిపరులైన జడ్జిలు, న్యాయవాదులున్నారని గత కొన్ని నెలల కిందట కర్ణన్‌ పలువురిపై ఆరోపించారు. దీంతో కర్ణన్‌ను వ్యతిరేకంగా కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు కర్ణన్‌ను ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనపై ధిక్కరణ కేసు నమోదు చేసి, బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.

జడ్జిలు, లాయర్లపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని, వారికి బేషరుతుగా క్షమాపణ చెబితే కేసు కొట్టేస్తామని కర్ణన్‌ను బెంచ్‌ అవకాశమిచ్చింది. అయితే కర్ణన్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

అంతేకాదు, తాను అంతా చట్ట ప్రకారమే చేశానని చెప్పారు. అంతేగాక, తనను వెంటనే విధుల్లోకి తిరిగి తీసుకోవాలని, లేదంటే మరోసారి కోర్టుకు హాజరుకానన్నారు. తానేమీ టెర్రరిస్టుని కాదని, కావాలంటే ఈ కేసులో తనను జైల్లో పెట్టుకోండని సవాల్‌ చేశారు. అయితే కర్ణన్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధిక్కార నోటీసులకు నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

English summary
When there is Justice C Karnan around there is bound to be a lot of drama. After a dramatic hearing on the contempt plea against him, Justice Karnan came out of the court hall and said that he would now pass an order against the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X