వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కా?: మరో ధర్మాసనానికి 'ఆధార్'

ఆధార్‌కు సంబంధించిన కేసుల విచారణను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదలీ చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌కు సంబంధించిన కేసుల విచారణను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదలీ చేసింది.

ఆధార్ చెల్లుబాటు తదితర అంశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జెఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ జెచలమేశ్వర్‌, జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.

అయితే, మంగళవారం ఈ ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందా? లేదా? అన్న అంశంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి రేపటి నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది.

Now, nine judge Constitution Bench to hear Aadhaar petitions

మంగళవారం విచారణ సందర్భంగా వ్యక్తిగత ప్రైవసీ హక్కుకు సంబంధించి రెండు తీర్పులు చర్చకు వచ్చాయి.

1960లో జస్టిస్‌ కరఖ్ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం, 1950లో జస్టిస్‌ ఎంపీ శర్మతో కూడి 8 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కు కిందకు రాదని తేల్చిచెప్పాయి.

దీంతో ఈ అంశంపై చర్చ జరగాలంటే మరింతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అవసరమని భావించి.. 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసింది.

English summary
A nine-judge Bench of the Supreme Court will on July 19, 2017 hear the question whether privacy in the world’s largest democracy is a fundamental human right and is a part of the basic structure of the Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X