వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూ. 10నోటు వచ్చేసింది: ఫీచర్లు ఇలా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్ కొత్త రూ.10 నోట్లను శుక్రవారం విడుదల చేసింది. చాకొలెట్‌ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్‌ ఆలయం డిజైన్‌ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

కొత్త రూ.10 నోటు ఫీచర్లు గమనించినట్లయితే.. పాత నోటులో '10' సంఖ్య మధ్యలో ఉండేది. కానీ, ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు. గాంధీ బొమ్మను కూడా మధ్యలో ముద్రించారు.

Now, RBI to shortly issue new Rs 10 notes in chocolate brown colour

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం కిందే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుర్తును ముద్రించారు. ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు. కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు.

నోటులో స్వచ్ఛ భారత్‌ లోగో కూడా కన్పిస్తోంది. ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది. కాగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50ల కొత్త నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కొత్త రూ.10ల నోటును ఆర్బీఐ విడుదల చేసింది.

English summary
The Reserve Bank of India (RBI) will shortly issue Rs.10 denomination banknotes under the Mahatma Gandhi series with chocolate brown colour as the base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X