వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ సి ఎల్ కు రూ.2,475 కోట్ల లాభాలు, టెక్కీలకు షాకివ్వనున్న టెక్ మహీంద్రా

మారిన పరిస్థితుల కారణంగా టెక్ కంపెనీలు నష్టాల బాటన పడుతుండడం, లాభాలు తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి.అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెక్ మహీంద్రా నాలుగో క్వార్టర్ లో రూ.2,475 కో

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల కారణంగా టెక్ కంపెనీలు నష్టాల బాటన పడుతుండడం, లాభాలు తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి.అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెక్ మహీంద్రా నాలుగో క్వార్టర్ లో రూ.2,475 కోట్ల లాభాలను నమోదు చేసింది.

దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ అంచనాలను అధిగమించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాలుగో క్వార్టర్స్ లో కన్సాలిడేటెడ్ లాభాల్లో 20 శాతం పైకి ఎగిసింది.

గత ఆర్థిక సంత్సరంలో ఇదే క్వార్టర్ లో ఈ లాభాలు రూ.1939 కోట్లుగా ఉన్నాయి. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారంగా ఈ టెక్ దిగ్గజం రూ.2,091 కోట్ల లాభాలను నమోదుచేస్తుందని నిపుణఉలు అంచనావేస్తున్నారు.

లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండడంతో కంపెనీ మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది.2017-18 సంవత్సరానికి రెండు రూపాయాల కలిగి ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు ఆరు రూపాయాల మధ్యంతర డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు కంపెనీ పేర్కొంది.

హెచ్ సి ఎల్ ఆదాయం 20 శాతం పెరుగుదల

హెచ్ సి ఎల్ ఆదాయం 20 శాతం పెరుగుదల

టెక్ మహీంద్రా ఆదాయం 20 శాతం పెరిగి , రూ.13,183 కోట్లుగా రికార్డైంది.ముందు ఏడాది ఈ ఆదాయం రూ.10,925 కోట్లుగా ఉంది.2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభాలు 53 శాతానికిపైగా పెరిగి రూ.8606.47 కోట్లుగా, మొత్తం ఆదాయం 52 శాతం పెరిగి రూ.48,640 కోట్లుగా రికార్డైంది. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవిన్యూలు 10.5-12.5 శాతం పెరుగుతోందని అంచనా వేస్తోంది.

ఆపరేటింగ్ మార్జిన్లు కూడ భారీగా పెరుగుదల

ఆపరేటింగ్ మార్జిన్లు కూడ భారీగా పెరుగుదల

ఆపరేటింగ్ మార్జిన్లు కూడ 19.5-20.5 శాతం రేంజ్ లో ఉంటాయని పేర్కొంది. 2017 మార్చి క్వార్టర్ ముగింపుకు కంపెనీలో 1,15973 ఉద్యోగులున్నారు. తమ ఐటీ సర్వీసుల అట్రీక్షన్ 12 నెలల కాలంలో 16.9 శాతంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.ఇది ముందటి ఏడాది కంటే తక్కువేనని చెప్పింది.

టెక్ మహీంద్రాలో వెయ్యి మంది ఉద్యోగులపై వేటు

టెక్ మహీంద్రాలో వెయ్యి మంది ఉద్యోగులపై వేటు

కీలకమైన మార్కెట్లలో మారుతున్న పరిణామాలతో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ దేశీయ టెక్ దిగ్గజం ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా ఉద్యోగులను తగ్గించుకొంటున్నాయి. విప్రో, ఇన్పోసిస్, కాగ్నిజెంట్ బాటలోనే టెక్ మహీంద్రా కూడ పయనిస్తోంది.ఈ నెలలో సుమారు వెయ్యిమందికి ఉద్వాసన పలకనుంది. పనితీరు ఆశించినంతగా లేని సిబ్బందిని తప్పించే ప్రక్రియను ప్రారంభించింది టెక్ మహీంద్రా.

సీనియర్లపైనే వేటు

సీనియర్లపైనే వేటు

గత ఏడాది డిసెంబర్ 31 నాటికి టెక్ మహీంద్రాలో 1,17,095 మంది ఉన్నారు. సాఫ్ట్ వేర్ విభాగంలో 80,895 మంది ఉద్యోగులున్నారు. ఆటోమేషన్ తో పాటు కొంగొత్త టెక్నాలజీల రాక, ప్రధాన మార్కెట్లలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు మొదలయ్యాయి. భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా పరిస్థితులు సుమారు 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న మద్యస్థాయి సిబ్బందిపై ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు.

English summary
After Infosys and Wipro it's now IT firm Tech Mahindra that could hand out pink slips to hundreds of employees as it looks to "weed out bottom performers".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X