వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్ డిబేట్: హనుమంతుడు ఏవర్గానికి చెందిన వాడు..?ఈ నేతలు చెప్పాలనుకుంటున్నది ఏమిటి..?

|
Google Oneindia TeluguNews

ఇటు కేంద్రంలో అటు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేవుళ్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలు చర్చించుకుంటే అది న్యూస్ కాదు కానీ... ఒకరికి మాదిరికరంగా ఉండాల్సిన నేతలే ఈ చర్చ తీసుకొస్తుండటం విశేషం. భారతదేశంలో దేవుళ్లను పూజించే సంస్కృతి ఉంది. అయితే ఫలానా దేవుడు ఆ కులంకు చెందిన వాడు, లేదా మరో కులంకు చెందిన వాడు అంటూ ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

మొన్న అంజనీపుత్రుడు హనుమంతుడు దళితుడని ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పవ్యాఖ్యలు చేశారు. నిన్న అదే హనుమంతుడు ముస్లిం అంటూ యూపీ బీజేపీ కౌన్సిలర్ బుక్కల్ నవాబ్ కామెంట్ చేసి మరో కాంట్రవర్శికీ తెరలేపారు. ఇక తాజాగా యోగీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న చౌదరి లక్ష్మీనారాయణ హనుమంతుడు జాట్ వర్గానికి చెందిన వాడు అంటూ వ్యాఖ్యానించి మరో కాంట్రవర్శీ క్రియేట్ చేశారు. ఇందుకు మంత్రి ఒక ఫిలాసఫీ కూడా చెప్పారు.

ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకునే గుణం లేదా సహాయం చేసే మనస్తత్వం జాట్లకు ఉంటుందట. కష్టాల్లో ఉన్న మనిషి పరిచయం లేనప్పటికీ జాట్లు సహాయం చేస్తారట. హనుమంతుడు కూడా ఇలానే సహాయం చేసేవాడని చెప్పారు లక్ష్మీనారాయణ. సీతను రావణుడు లంకకు ఎత్తుకెళ్లాక రాముడికి హనుమంతుడు సహాయం చేశాడు కాబట్టి ఆయన జాట్ వర్గానికి చెందిన వాడై ఉంటాడని పేర్కొన్నారు మంత్రి లక్ష్మీనారాయణ.

Now, UP minister claims Lord Hanuman was a Jat

ఇక మంత్రులు హనుమాన్‌ను ఓ వర్గానికి లేదా ఒక కులానికి ఆపాదించడం ఇది మొత్తంగా మూడోసారి. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్... హనుమంతుడు అడవుల్లో ఉండేవాడని వెనకబడిన వర్గానికి చెందిన వాడని చెబుతూ ఆయన దళితుడని చెప్పారు. భారత్‌లోని అన్ని వర్గాల వారిని కలిపే బాధ్యతను హనుమంతుడు తీసుకున్నాడని యోగీ చెప్పారు. రెహ్మాన్, సుల్తాన్, రమ్జాన్, ఇమ్రాన్, పుర్ఖాన్, సుల్తాన్‌ పేర్లులా హనుమాన్ కూడా ఉందని అందుకే ఆయన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారని అది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.

ఇదిలా ఉంటే భోపాల్‌కు చెందిన మరో పూజారి హనుమంతుడు జైన్ మతానికి చెందిన వాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా హనుమంతుడు ఏ కులానికి , ఏ మతానికి చెందిన వాడో రాజకీయనాయకులే డిసైడ్ చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ నేతలు ఏమి చెప్పాలనుకుంటున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దేవుడిపై రాజకీయాలు ఎందుకని ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మనుషుల మధ్య చిచ్చు పెట్టొద్దని పలువురు కోరుకుంటున్నారు.

English summary
The slugfest over the identity of Hindu god Hanuman among Uttar Pradesh politicians continued on Friday with Minister for Religious Affairs Chaudhary Laxmi Narayan claiming that “Hanuman was a Jat”. “I think Hanuman ji was a Jat. It is in the nature of a Jat to help anyone who is in trouble, irrespective of whether the concerned person is known to him or her. It is similar to the way in which Hanuman joined Lord Ram to rescue Sita after she was abducted by Raavan,” he was quoted as saying by news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X