వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: పేటీఎం మేసేజింగ్ సర్వీస్, వాట్సాప్‌కు పోటీయేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పేటీఎం ఇన్‌బాక్స్‌ను మేసేజింగ్ సర్వీస్‌ను కూడ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్‌కు పోటీగా పేటీఎం ఇన్‌బాక్స్ మేసేజింగ్ సర్వీసును తీసుకువచ్చింది.

డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల రంగంలోకి వచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో పేటీఎం వాట్సాప్‌కు పోటీగా వచ్చేసింది. పేటీఎం కంపెనీ ఇన్‌బాక్స్‌ అనే మెసేజింగ్‌ సర్వీసును ప్రారంభించింది.

Now use Paytm 'Inbox' to chat and transact all at once

ఈ ప్లాట్‌ఫామ్‌తో ఏకకాలంలో చాటింగ్‌, లావాదేవీలు జరుపుకునేలా కన్జ్యూమర్లకు అవకాశం కల్పిస్తోంది. తమ యూజర్లు, మెర్చంట్లు కేవలం పేమెంట్లు మాత్రమే జరుపుకునేలా కాకుండా.. ఒకరినొకరు సంభాసించుకునేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్టు పేటీఎం సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ దీపక్‌ అబోట్‌ చెప్పారు. సోషల్‌ మెసేజింగ్‌, కామర్స్‌, పేమెంట్స్‌ ఒకదానితో ఒకటి మిళతమవ్వాల్సినవసరం ఉందని పేర్కొన్నారు.

పేటీఎం తీసుకొచ్చిన ఈ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కేవలం టెక్ట్స్‌లను పంపుకోవడం మాత్రమే కాకుండా వినియోగదారులు ఫోటోలను, వీడియోలను, లైవ్‌ లొకేషన్లను, క్యాప్చర్‌, షేర్‌ మూమెంట్లను పంపే అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఈ పేటీఎం మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆండ్రాయిడ్స్‌లో లైవ్‌లోకి వచ్చింది. ఆపిల్‌ స్టోర్‌లలోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పేటీఎం ఇన్‌బాక్స్‌లో నోటిఫికేషన్లు, ఆర్డర్లు, గేమ్స్‌ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ల కింద యూజర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను చూడొచ్చు. ఆర్డర్లను ట్రాక్‌ చేసి, లావాదేవీ అప్‌డేట్లను కూడా పొందవచ్చు.

English summary
Preparing the field for the expected big bang entry of Facebook-owned Whatsapp into the digital payments space of India, the largest payment company Paytm has launched 'Inbox', a messaging service that will allow consumers to chat and transact, simultaneously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X