వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు పిల్లల వివాదం: 'సాక్షి' తర్వాత సాధ్వి ప్రాచీ

By Pratap
|
Google Oneindia TeluguNews

బిల్వారా: ప్రతి హిందూ మహిళ నలుగురేసి పిల్లలను కనాలనే ప్రకటన ద్వారా బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ సృష్టించిన వివాదం సమసిపోకుండా విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) మహిళా నేత అదే ప్రకటన చేశారు. ప్రతి దంపతుల నుంచి తమకు నలుగురేసి పిల్లలు కావాలని ఆమె అన్నారు. విశ్వహిందూ పరిషత్ విరాట్ హిందూ పేర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి హిందూ మహిళ నుంచి నలుగురు పిల్లలు కావాలని ఆమె అన్నారీు. వారిలో ొకర దేశ సరిహద్దులను కాపాడుతారని, ఒకరిని హిందూ సన్యాసులకు బహుమతిగా ఇవ్వాలని, మూడో సంతానాన్ని విహెచ్‌పి ఇవ్వాలని, తద్వారా సామాజిక సేవ చేయవచ్చునని, నాలుగో సంతానం భారత సంస్కృతిని పరిరక్షించడానికి పనికి వస్తుందని ఆమె వివరించారు.

Now VHP leader calls on Hindu women to have four children

హిందూ మతాన్ని పరిరక్షించడానికి ప్రతి మహిళ నలుగురేసి పిల్లలను కనాలని సాక్షి మహరాజ్ ఈ మధ్య ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో తీవ్ర వివాదం చెలరేగింది. బిజెపి ఆ ప్రకటనతో తమకు సంబంధం లేదని కూడా వ్యాఖ్యానించింది.

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా సాక్షి మహరాజ్ ప్రకటనతో విభేదించారు. అటువంటి ప్రకటనలతో పార్టీకి నష్టం జరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే, తాను తప్పేమీ మాట్లాడలేదని సాక్షి మహరాజ్ సమర్థించుకోవడానికి ప్రయత్నించారు.

English summary
After BJP MP Sakshi Maharaj, now a VHP leader has made controversial remarks on the number of children a Hindu woman should have.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X