వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాత్రిపూట రైళ్లలో సెల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌కు నో ఛాన్స్!

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఇక నుంచి రాత్రి వేళల్లో మనం రైళ్లలో ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్‌ పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. గంత కొంతకాలంగా రైళ్లలో సంభవిస్తున్న దొంగతనాలు, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదాల నేపథ్యంలో పశ్చిమ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

 Now, you may not be able to charge your phones, laptops in trains at night!

రాత్రి 11నుంచి ఉదయం 5గంటల వరకు ఛార్జింగ్‌లు పెట్టుకునే వీలు లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు రాత్రి సమయంలో ఛార్జింగ్‌కి పెట్టి వదిలేస్తున్నారని, ఇదే అదనుగా దొంగలు వాటిని చోరీ చేస్తున్నారని రైల్వేశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది.

అంతేకాకుండా, షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా అగ్నిప్రమాదాలు కూడా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పశ్చిమ మధ్య రైల్వేలో ప్రస్తుతం ఈ నిబంధన అమలు చేయనున్నారు.

English summary
In view of the recent spurt in robbery incidents in trains, Railways has issued a new directive that electricity supply to charge phones and mobile phones for passengers will be stopped at night to avoid robberies or fire incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X