వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్మిషన్ లేకుండా గ్రూప్‌లో చేర్చడానికి చెక్... అందుబాటులోకి వాట్సప్‌ గ్రూప్ ఇన్వైట్ ఫీచర్

|
Google Oneindia TeluguNews

వాట్సప్ గ్రూపులు ఇబ్బందిగా మారాయా? మీ పర్మిషన్ లేకుండానే గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారా? ఇకపై ఇలాంటి సమస్య ఉండబోదని అంటోంది వాట్సప్. మీ పర్మిషన్ లేకుండా ఏ వాట్సప్ గ్రూపులోను మీ నెంబర్ యాడ్ చేయకుండా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక "చెక్ పాయింట్"! పంపిన వారిపని అంతే

గ్రూప్ ఇన్వైట్ ఫీచర్

గ్రూప్ ఇన్వైట్ ఫీచర్

యూజర్లు ఎదుర్కొంటున్నఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా చెక్ పాయింట్ టిప్‌లైన్ సర్వీస్ ప్రారంభించిన వాట్సప్.. తాజాగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఎవరుపడితే వాళ్లు ఎవరిని పడితే వాళ్లను గ్రూపుల్లో యాడ్ చేసే అవకాశం ఉండదు. ఏదైనా గ్రూపులో ఒక నెంబర్ యాడ్ చేయాలంటే సదరు వ్యక్తి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇన్విటేషన్ రిక్వెస్ట్

ఇన్విటేషన్ రిక్వెస్ట్


గ్రూప్ అడ్మిన్లు వాట్సప్ గ్రూప్‌లో నెంబర్ యాడ్ చేయాలంటే ముందు మెసేజ్ రూపంలో ఇన్వైట్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. దానికి సదరు యూజర్ ఓకే చెబితేనే గ్రూప్‌లో ఆ నెంబర్ యాడ్ చేయడం సాధ్యమవుతుంది. రిక్వెస్ట్ పంపిన మూడు రోజుల్లోగా యూజర్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అది ఎక్స్‌పైర్ అవుతుంది.

ఎలా సెట్ చేసుకోవాలి?

ఎలా సెట్ చేసుకోవాలి?

వాట్సప్‌లో ఇన్వైట్ సిస్టం ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పైన కనిపించే ప్రైవసీలోకి వెళ్లి గ్రూప్ సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దానిలో ఎవ్రీబడీ, మై కాంటాక్ట్స్, నోబడి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. నోబడి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీ పర్మిషన్ ఉంటే తప్ప ఎవరూ మిమ్మల్ని ఏ గ్రూప్‌లో యాడ్ చేయలేరు.

English summary
WhatsApp, the Facebook-owned messaging platform, has finally heard your request and the feature is rolling out with its latest update to some users on Wednesday, and is likely to get a global release in the coming weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X