వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ ఏటీఎంలు వస్తున్నాయ్: ఇక బ్యాంకులకు వెళ్లక్కర్లేదు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏటీఎం తయారీదారుదారు, సేవలందించే ఎన్‌సీఆర్ కార్పొరేషన్ వినియోగదారులకు మరిన్ని సేవలందించే మల్టీ ఛానల్ ఏటీఎంలను రూపొందించింది. బ్యాంకుకు వెళ్లకుండానే ఈ ఏటీఎం మెషీన్ ద్వారా ఏటీఎం కార్డును కూడా పొందవచ్చు.

ఈ ఏటీఎం మెషీన్ భవిష్యత్‌లో బ్యాంకుగా కూడా సేవలందించే అవకాశాలున్నాయి. అయితే, ఈ ఏటీఎంల ఖరీదు రూ. 30-50లక్షల వరకు ఉంటుంది. అంతేగాక, మెషీన్ అందించే సేవలను బట్టి దాని ధరలో తేడాలుంటాయి.

SS32,SS22, SS83 అనే మూడు రకాల ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి సాధారణ ఏటీఎంలానే పనిచేస్తాయి కానీ, వీటిలో అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మెషీన్లలో బ్యాంక్ అకౌంట్ తెరవడంతోపాటు చెక్కును క్లియర్ చేసుకునే అవకాశం ఉండటం విశేషం.

Now, your ATMs may open bank accounts, clear cheques

ఇన్‌స్టాంట్ బ్యాంక్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్, ఆటోమేటిక్ సిగ్నేచర్ వేరిఫికేషన్, నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్ టాపప్స్ చేసుకోవడం లాంటి సేవలం వీటిలో అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వినియోగదారులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా దాదాపు తగ్గిపోనుంది.

త్వరలోనే పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకు రంగాలు సాధారణ ఏటీఎంల స్థానంలో ఈ మల్టీ ఛానల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నాయి. ఎన్‌సీఆర్ కార్పోరేషన్ ఈ ఏటీఎంలను విస్తారంగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను ఇప్పటికే చేసింది.

English summary
ATM manufacturer and service provider NCR Corporation introduced a new multi-channel solution to the customers which will facilitate more functions on an ATM. Now, you may get your ATM card even without going to bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X